ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలువ మూసి భారీ వెంచర్‌ నిర్మాణం

ABN, First Publish Date - 2022-08-04T06:05:51+05:30

పట్టణంలో ఓ భారీ వెంచర్‌ అక్రమాలకు పాల్పడుతున్నది.

భారీవెంచర్‌లో ఓ కుంట తూము కాలువను ఫైపులతో మూసివేసిన దృశ్యం(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తుది లేఅవుట్‌ అనుమతులు రాకముందే ఇళ్ల నిర్మాణాలు

 సదాశివపేట పట్టణంలో ఎన్‌వోసీ జారీ చేసిన ఉన్నతాధికారులు

సదాశివపేట, ఆగస్టు 3: పట్టణంలో ఓ భారీ వెంచర్‌ అక్రమాలకు పాల్పడుతున్నది. వెంచర్‌ నిర్మాణం సమయంలో వెంచర్‌ యాజమాన్యం వెంచర్‌కి పక్కనే ఉన్న ఓ కుంటకు చెందిన తూమును కూల్చి వేసి తమ వెంచర్‌కు ప్రమాదం లేకుండా తూము కట్ట ఎత్తును తగ్గించింది. అంతటితో ఆగకుండా తూము ద్వారా నీళ్లు ప్రవహించే(కాలువ)ను దర్జాగా పైపులతో భూమిలో కప్పివేయించింది. ఇంత జరిగినా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోలేదు. నిబంధనల మేరకు తూము కాలువకు ఇరువైపులా మూడు మీటర్ల మేర (బఫర్‌జోన్‌) ఉండాలి. ఈ బఫర్‌ జోన్‌ ప్రాంతమంతా ఖాళీ స్థలంగా ఉండాలి. ఎలాంటి నిర్మాణాలు ఉండరాదు. కానీ ఈ వెంచర్‌లో ఏకంగా తూము కాలువ మాయమైపోవడమే కాకుండా తూము కట్ట ఎత్తును సైతం తగ్గించిన ఆనవాళ్లు కళ్లకు కడుతున్నా...ఉన్నతాధికారులు వెంచర్‌ ఏర్పాటుకు (ఎన్‌ఓసీలు) నిరభ్యంతర సర్టిఫికెట్లు జారీ చేయడం గమనార్హం. 


అనుమతులు రాకముందే ఇళ్ల నిర్మాణాలు

ఈ భారీ వెంచర్‌కు (డీటీసీపీ) డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ నుంచి తుది అనుమతులు రాక ముందే వెంచర్‌లో యఽథేచ్ఛగా బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో చెరువులు, కుంటల పరిధిలో వెలుస్తున్న వెంచర్లలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై చర్యలు తీసుకుని, జలవనరుల అస్తిత్వాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.   

Updated Date - 2022-08-04T06:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising