ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదేళ్లయినా అసంపూర్తిగానే!

ABN, First Publish Date - 2022-05-24T05:02:10+05:30

రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం గ్రామాల్లో మినీ మార్కెట్‌ గోదాం నిర్మాణ పనులు చేపట్టినా అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం వల్ల ముందుకుసాగడం లేదు.

వెంకట్రావ్‌పేట గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన మినీ మార్కెట్‌ గోదాం నిర్మాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకట్రావ్‌పేటలో వినియోగంలోకి రాని మినీ మార్కెట్‌ గోదాం 

తొగుట, మే 23: రైతుల సౌలభ్యం కోసం ప్రభుత్వం గ్రామాల్లో మినీ మార్కెట్‌ గోదాం నిర్మాణ పనులు చేపట్టినా అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల బాధ్యతారాహిత్యం వల్ల ముందుకుసాగడం లేదు. తొగుట మండలం వెంకట్రావ్‌పేట గ్రామంలో 2012లో అప్పటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి (ఎస్డీఎఫ్‌) డెవల్‌పమెంట్‌ కింద మినీ మార్కెట్‌ గోదాం నిర్మాణం కోసం రూ.50 లక్షల నిధులు మంజూరు చేశారు. రూ.50 లక్షల నిధులను ఒకేసారి కాకుండా రూ.5 లక్షల చొప్పున బిట్ల మాదిరిగా విడుదల చేశారు. దాంతో అదే గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ వంద మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పుతో 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మినీ మార్కెట్‌ గోదాం నిర్మాణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్‌ను అధికారులు, ప్రజాప్రతినిధులంతా కలిసి పర్సంటేజీల పేరుతో అప్పట్లో నిండా ముంచినట్లు ఆరోపణలున్నాయి. అయినప్పటికీ గ్రామంలో గోదాం నిర్మాణం చేపడితే రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావించిన కాంట్రాక్టర్‌ ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపట్టినట్లు సమాచారం. కానీ మినీ మార్కెట్‌ గోదాం నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు సరిపోకపోవడంతో పనులు అసంపూర్తి దశలో నిలిచిపోయాయి. అదే సమయంలో అప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్న ముత్యంరెడ్డి ఓటమి చెందటం టీఆర్‌ఎస్‌ నుంచి రామలింగారెడ్డి గెలుపొందడం జరిగిపోయింది. దాంతో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చేపట్టిన పనులపై ప్రజాప్రతినిధులు శీతకన్ను పెట్టడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. దాంతో కాంట్రాక్టర్‌ అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. పూర్తిస్థాయిలో మినీ గోదాం వినియోగంలోకి రావడానికి ఇంకా సుమారు రూ.50 లక్షల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా. కానీ రైతుల సౌలభ్యం కోసం నిర్మించిన ఈ గోదాం పూర్తయ్యేలా చూడాల్సిన నాయకులు రాజకీయ లబ్ధికోసం అసంపూర్తిగా ఉన్న గోదాంను ఫంక్షన్‌హాల్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గోదాం నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-24T05:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising