ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలను కమ్మేసిన ఇసుక దిబ్బ

ABN, First Publish Date - 2022-05-26T11:27:22+05:30

శివ్వంపేట, మే 25: పొట్టకూటి కోసం పనికి వెళ్లిన ఆ దినసరి కూలీలు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. కూలి పనిలో భాగంగా వాగులో ఇసుక తవ్వుతున్న వారిపై.. రాకాసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మెదక్‌ జిల్లా గుండ్లపల్లిలో ఇద్దరి మృతి

- విషయం చెప్పకుండా ట్రాక్టర్‌ యజమాని డ్రామా

- న్యాయం కోసం బాధిత కుటుంబాల ఆందోళన

శివ్వంపేట, మే 25: పొట్టకూటి కోసం పనికి వెళ్లిన ఆ దినసరి కూలీలు అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. కూలి పనిలో భాగంగా వాగులో ఇసుక తవ్వుతున్న వారిపై.. రాకాసి ఇసుక దిబ్బ ఒక్కసారిగా కూలి పడింది. ఏం జరిగిందో తేరుకునేలోపే నిండా కప్పేసింది. దీంతో కూలీలిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గుండ్లపల్లిలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దినసరి కూలీలు అశోక్‌(32), మహే్‌ష(22)లను అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ యజమాని తలారి ఆంజనేయులు పనికి తీసుకెళ్లాడు. గ్రామ శివారులోని దుబ్బలమాకు వాగు వద్ద ట్రాక్టర్‌ను నిలిపి.. ఇసుక నింపాలని కూలీలకు చెప్పి.. వెళ్లిపోయాడు. కూలీలిద్దరూ ఇసుక తవ్వుతుండగా పెద్ద దిబ్బ కూలడంతో, వారు అందులో కూరుకుపోయారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న ఆంజనేయులు.. అశోక్‌, మహేష్‌ కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. పెద్ద ఇసుక దిబ్బ కూలిపోయి ఉండటం చూసి.. ఇద్దరూ అందులో కూరుకుపోయి ఉంటారని ఆందోళన చెందాడు. వెంటనే వారి బట్టలు, ట్రాక్టర్‌ తీసుకుని ఊళ్లోకి వెళ్లాడు. ట్రాక్టర్‌ను తన ఇంటి వద్ద నిలిపి.. కూలీల ఇళ్లకు వెళ్లాడు. అశోక్‌, మహేష్‌ కనిపించడం లేదని చెప్పి, వారి బట్టలను కుటుంబ సభ్యులకు ఇచ్చి, వెళ్లిపోయాడు. ఆంజనేయులు ప్రవర్తనతో అనుమానం వచ్చిన కూలీల కుటుంబ సభ్యు లు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ కూలిన ఇసుక దిబ్బను చూసి తమ వారు అందులో కూరుకుపోయి ఉంటారని ఆందోళన చెందారు. వెంటనే సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఎక్స్‌కవేటర్‌ తెప్పించి, ఇసుక దిబ్బలు తొలగించగా, ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. కాగా, తమకు న్యాయం చేసే వరకు మృతదేహాలను ఘటనా స్థలం నుంచి కదిలించేది లేదని బాధిత కుటుంబాల వారు ఆందోళన చేశారు. గతంలో ఇసుక కోసం తీసిన గుంతల వల్లే తమ వారి ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గంట పాటు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారికి సర్దిచెప్పి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా, కూలీలు ఇసుకలో కూరుకుపోయారని ముందే తెలిసిన ట్రాక్టర్‌ యజమాని ఆంజనేయులు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది.

Updated Date - 2022-05-26T11:27:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising