ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్య సంపదకు నిలయంగా తెలంగాణ

ABN, First Publish Date - 2022-12-13T23:42:19+05:30

ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి

రాయిన్‌పల్లి ప్రాజెక్టులో చేప పిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ అర్బన్‌, డిసెంబరు 13: సీఎం కేసీఆర్‌ కృషితో తెలంగాణ రాష్ట్రం మత్స్య సంపదకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ మండల పరిధిలోని రాయిన్‌పల్లి ప్రాజెక్టులో 2.90 లక్షల ఉచిత చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో మత్స్య సంపద అంటే ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేందన్నారు. కానీ నేడు తెలంగాణ మత్స్య విప్లవంగా మారిందన్నారు. నియోజకవర్గంలో 1.80 కోట్ల చేప పిల్లలను వదిలినట్లు చెప్పారు. వచ్చే ఏడాది రొయ్యలను కూడా ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కొత్త సొసైటీలో గంగపుత్రులకు, ముదిరాజ్‌లకు సభ్యత్వం తీసుకునే అవకాశం ఇవ్వాలని మత్స్యశాఖ అధికారిణి రజనీకి సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైస్‌ చైర్‌పర్సన్‌ లావణ్యరెడ్డి, ఎంపీపీ యమునా, ఆత్మకమిటీ చైర్మన్‌ అంజాగౌడ్‌, మండల రైతు బంధు అధ్యక్షుడు కిష్టయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ హన్మంతురెడ్డి, గ్రామ సర్పంచ్‌ సిద్దగౌడ్‌, నాయకులు యాదగిరి, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising