ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేర్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తెలంగాణ

ABN, First Publish Date - 2022-07-01T05:41:44+05:30

తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ అటవీ పరిశోధన కేంద్రం, విస్తరణ సేవలు(సెంటర్‌ ఫర్‌ అగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీసెస్‌, కేర్స్‌)కు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా నిలుస్తుందని సీఎం ఓఎ్‌సడీ, ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాలేజ్‌ డీన్‌ సొసైటీ అధ్యక్షురాలు ప్రియాంక వర్గీస్‌ అన్నారు. గురువారం ములుగు మండలంలోని అటవీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ కమ్యూనిటీ అభివృద్ధికి కేర్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తెలంగాణ రాష్ట్రం మారబోతున్నదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌


ములుగు, జూన్‌ 30: తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ అటవీ పరిశోధన కేంద్రం, విస్తరణ సేవలు(సెంటర్‌ ఫర్‌ అగ్రోఫారెస్ట్రీ రీసెర్చ్‌ అండ్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీసెస్‌, కేర్స్‌)కు సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా నిలుస్తుందని సీఎం ఓఎ్‌సడీ, ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాలేజ్‌ డీన్‌ సొసైటీ అధ్యక్షురాలు ప్రియాంక వర్గీస్‌ అన్నారు. గురువారం ములుగు మండలంలోని అటవీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయ కమ్యూనిటీ అభివృద్ధికి కేర్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తెలంగాణ రాష్ట్రం మారబోతున్నదన్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్‌సీఆర్‌ఐలోని సిల్వికల్చర్‌ అండ్‌ అగ్రోఫారెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో కేర్స్‌ టీఎస్‌ స్థాపించబడినట్లు వెల్లడించారు. ఈ సొసైటీ ఆగ్రోఫారెస్ట్రీ, సంబంధిత విషయాల్లో పరిశోధన, శిక్షణ పొడిగింపు కన్సల్టెన్సీని నిర్వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. సమావేశంలో ఎఫ్‌సీఐ ప్రొఫెసర్‌ మమత, డాక్టర్‌ రీజా, డాక్టర్‌ ప్రియ, డాక్టర్‌ చిరంజీవ, కె.శ్రీనివాస్‌, ఎ.నరసింహారెడ్డి, డా.శ్రీధర్‌, అసోక్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌ అన్నారు. గురువారం ములుగు, అన్నసాగర్‌ గ్రామాల్లో ఆమె పర్యటించారు. అన్నాసాగర్‌లో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ మహిపాల్‌రెడ్డిని అభినందించారు. ఆమెవెంట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, జిల్లా పీడీ గోపాల్‌రావు తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-07-01T05:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising