ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ఉపాధ్యాయుల చలో కలెక్టరేట్‌

ABN, First Publish Date - 2022-01-28T06:01:03+05:30

జీవో 317 సవరించాలని, స్థానికత కోల్పోయిన జూనియర్లకు న్యాయం చేయాలని నేడు చలో కటెక్టరేట్‌కు పిలుపునిచ్చినట్టు యుఎ్‌సపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సన్నాహక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల కేటాయింపులో జరిగిన అవకతవకలు, సీనియార్టీలో జరిగిన అవకతవకలు, పొరపాట్లపై అప్పీళ్లు, భార్యాభర్తలు, వితంతువులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట అగ్రికల్చర్‌, జనవరి 27: జీవో 317 సవరించాలని, స్థానికత కోల్పోయిన జూనియర్లకు న్యాయం చేయాలని నేడు చలో కటెక్టరేట్‌కు పిలుపునిచ్చినట్టు యుఎ్‌సపీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన సన్నాహక సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల కేటాయింపులో జరిగిన అవకతవకలు, సీనియార్టీలో జరిగిన అవకతవకలు, పొరపాట్లపై అప్పీళ్లు, భార్యాభర్తలు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల అప్పీళ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరికి వ్యతిరేకంగా నేడు చలో కలెక్టరేట్‌ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని రెండో దశ ఉద్యమంలో భాగంగా కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపనున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయులందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర బాధ్యుడు ఎస్‌.కనకయ్య, జిల్లా బాధ్యులు రామస్వామి, విజేందర్‌రెడ్డి, రాజిరెడ్డి, మల్లయ్య, కృష్ణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising