ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయడం లేదు
ABN, First Publish Date - 2022-12-07T23:43:52+05:30
వర్గల్, డిసెంబరు 7: వర్గల్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయడం లేదని ఎంఈవోపై ఎంపీటీసీలు ధ్వజమెత్తారు.
సర్వసభ్య సమావేశంలో మండల విద్యాధికారిపై ధ్వజమెత్తిన ఎంపీటీసీలు
వర్గల్, డిసెంబరు 7: వర్గల్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బాధ్యతతో పనిచేయడం లేదని ఎంఈవోపై ఎంపీటీసీలు ధ్వజమెత్తారు. బుధవారం వర్గల్ ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షురాలు జాలిగామ లత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని నాచారంతో పాటు పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని, ఈ విషయాన్ని ఎంఈవో సునీతకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా అయితే పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత ఎలా సాధిస్తారని నాచారం ఎంపీటీసీ వెంకటేశ్‌గౌడ్ ప్రశ్నించారు. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ కాలాన్ని వృథా చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో పిల్లల చదువులు వెనుకబడుతున్నాయని, ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ ఎందుకు పెడుతుందని మినాజీపేట ఎంపీటీసీ శ్రీనివాస్ ప్రశ్నించారు. నిధులు వృఽథా తప్ప ప్రయోజనం ఉండటం లేదని ఎంఈవోపై మండిపడ్డారు. అనంతరం ఎంపీపీ లత మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వర్ణకుమారి, జడ్పీటీసీ బాలుయాదవ్, తహసీల్దార్ సతీ్‌షకుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పాశం శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్, ఎంపీటీసీలు సజనిత, స్వాతి, శ్యామల, జనార్ధన్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:43:53+05:30 IST