ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాయితీ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-03-06T05:17:17+05:30

తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ ఈ చలాన్లపై ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ ప్రకటనలో కోరారు. పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌పై చెల్లించేందుకు ఈనెల 1 నుంచి 31 వరకు వెసులుబాటు కల్పించినట్లు స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌


 సంగారెడ్డి క్రైం, మార్చి 5 : తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ ఈ చలాన్లపై ఇచ్చిన వెసులుబాటును సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్‌ ప్రకటనలో కోరారు. పెండింగ్‌ చలాన్లను డిస్కౌంట్‌పై చెల్లించేందుకు ఈనెల 1 నుంచి 31 వరకు వెసులుబాటు కల్పించినట్లు స్పష్టం చేశారు. టూ వీలర్‌, త్రీ వీలర్‌ వాహనదారులు 75 శాతం రాయితీ పోగా 25 శాతం మాత్రమే చెల్లించాలన్నారు. ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీ పోగా 30శాతం చెల్లించాలని, ఫోర్‌ వీలర్‌ వాహనాలు, హెవీ వేహికిల్స్‌ 50 శాతం రాయితీ పోగా 50శాతం మాత్రమే చెల్లించాలన్నారు. మీ సేవా, ఆన్‌లైన్‌ సేవాకేంద్రాల్లో ఈ చలాన్లు చెల్లించి రశీదులు తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ఈచలాన్‌.టీఎ్‌సపోలీ్‌స.జీవోవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో కూడా చలాన్లను చెల్లించవచ్చని పేర్కొన్నారు.  


Updated Date - 2022-03-06T05:17:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising