ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద వ్యక్తులపై నిఘా

ABN, First Publish Date - 2022-01-23T04:46:01+05:30

రౌడీలు, అనుమానాస్పద వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిద్దిపేట సీపీ ఎన్‌.శ్వేత


గజ్వేల్‌, జనవరి 22: రౌడీలు, అనుమానాస్పద వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచాలని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు. గజ్వేల్‌ పోలీ్‌సస్టేషన్‌ను శనివారం ఆమె సందర్శించి, పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. సీసీ కెమెరాలను ప్రతీ రోజు మానిటర్‌ చేయాలన్నారు. పనిచేయని సీసీ కెమెరాలను వెంటనే బాగుచేయించాలని, రాత్రి వేళలో గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో రోల్‌క్లారిటీ, గోల్‌క్లారిటీపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్‌ నేరాల నియంత్రణకు గ్రామాల్లో, పట్టణాల్లో గ్రామాల వీపీవో అధికారులు, సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. సీసీటీయన్‌య్‌స ప్రాజెక్టు ద్వారా ప్రతీ దరఖాస్తును, ఎఫ్‌ఐఆర్‌లను, సీడీఎఫ్‌, పార్ట్‌-1, పార్ట్‌-2 రిమాండ్‌సీడీ, ఛార్జ్‌షీట్‌, కోర్టు డిస్పోజల్‌, ఆన్‌లైన్‌లో ప్రతీరోజు ఎంట్రీ చేయాలని చెప్పారు. పోలీసు అధికారులకు ఏవైనా సమస్యలుంటే హెచ్‌ఆర్‌ఎంఎ్‌స గ్రీవెన్స్‌ సెల్‌ ద్వారా పంపించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్లను గుర్తించి బ్లాక్‌స్పాట్‌లుగా సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. సమన్వయంతో విధులు నిర్వర్తించి క్రైమ్‌రేటును తగ్గించాలని సూచించారు. గత మూడు సంవత్సరాలుగా పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆమెవెంట ఏసీపీ మడత రమేశ్‌, గజ్వేల్‌ సీఐ భూమా వీరప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ రామునాయక్‌, ఎస్‌ఐలు శ్రీధర్‌రెడ్డి, నరేశ్‌, శంకర్‌ ఉన్నారు. 


 

Updated Date - 2022-01-23T04:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising