ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-15T06:00:31+05:30

తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడుపాక గ్రామం లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాపన్నపేట, మే 14: తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కొడుపాక గ్రామం లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. ఎస్‌ఐ విజయ్‌నారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కొడుపాక గ్రామానికి చెందిన బుసనెల్లి గణేష్‌ (20) ఇంటి వద్దే ఖాళీగా ఉండటంతో తనతోపాటు గొర్రెలు మేపేందుకు రావాలని తండ్రి లక్ష్మయ్య సూచించాడు. ఎన్నిసార్లు చెప్పినా రాకపోయేసరికి శుక్రవారం మధ్యాహ్నం కుమారుడిని మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన గణేష్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి తిరిగి రాలేదు. తండ్రి పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది.   అయితే గ్రామ చెరువుకు వెళ్లే దారిలో పురుగుల మందు తాగిన గణేష్‌ నోటి నుంచి నురగలు రావడంతో అటుగా వెళ్లినవారు గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. వెంటనే ఆటోలో మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2022-05-15T06:00:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising