విద్యార్థినులను బడిలో చేర్చుకున్న యాజమాన్యం
ABN, First Publish Date - 2022-12-16T23:57:23+05:30
‘ఫీజు బకాయి ఉందని బడి నుంచి పంపేశారు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు కేవీపీఎస్ నాయకులు స్పందించి, పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థినులను బడిలో చేర్పించారు.
ఆంధ్రజ్యోతి వార్తకు స్పందించిన కేవీపీఎస్ నాయకులు
ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందిపెట్టొద్దని సూచన
కంది, డిసెంబరు 16 : ‘ఫీజు బకాయి ఉందని బడి నుంచి పంపేశారు’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్తకు కేవీపీఎస్ నాయకులు స్పందించి, పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థినులను బడిలో చేర్పించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం, సీపీఎం నాయకుడు పి.కృష్ణ మాట్లాడుతూ యాజమాన్యం ఫీజులు, ఇతర విషయాలపై విద్యార్థులను ఇబ్బందిపెట్టొద్దని, తల్లిదండ్రులు, సంరక్షకులతో మాత్రమే మాట్లాడాలని సూచించారు. పాఠశాలలో ఇబ్బందులు ఎదురైతే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మనస్తాపంతో చదువుపై దృష్టి సారించలేరని అన్నారు. విద్యార్థినుల తండ్రి, పంచాయతీ కార్మికుడు క్యాసారం శివరాజ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2022-12-16T23:58:37+05:30 IST