ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలి

ABN, First Publish Date - 2022-12-16T23:57:30+05:30

క్రమశిక్షణతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సునీతారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సాపూర్‌, డిసెంబరు 16: క్రమశిక్షణతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి విద్యార్థులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లోని బీసీ బాలుర వసతిగృహాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. వసతిగృహంలో సమస్యలు తెలుసుకోవడంతో పాటు చదువు ఎలా సాగుతుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని తెలిపారు. విద్యార్థులకు భోజనం బాగా పెడుతున్నారని వార్డెన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. అంతకు ముందు హాస్టల్‌ విద్యార్థులు మైదానంలో వాలీబాల్‌ ఆడుతుండటంతో సునీతారెడ్డి వారి వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆమె వెంట నాయకులు సత్యంగౌడ్‌, వెంకట్‌, సురారంనర్సింలు, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:57:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising