ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీజు బకాయి ఉందని బడి నుంచి పంపేశారు

ABN, First Publish Date - 2022-12-15T23:49:18+05:30

ఫీజు బాకాయి ఉన్నారని విద్యార్థినులచే బలవంతంగా టీసీ కోసం దరఖాస్తు రాయించుకుని పాఠశాల నుంచి గెంటేయడమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకోమని తోటి విద్యార్థుల ఎదుట దూషించిన ఘటన సంగారెడ్డి జిల్లా కందిలో వెలుగు చూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలవంతంగా టీసీ కోసం దరఖాస్తు తీసుకున్నారు

కంది, డిసెంబరు 15 : ఫీజు బాకాయి ఉన్నారని విద్యార్థినులచే బలవంతంగా టీసీ కోసం దరఖాస్తు రాయించుకుని పాఠశాల నుంచి గెంటేయడమే కాకుండా దిక్కున్న చోట చెప్పుకోమని తోటి విద్యార్థుల ఎదుట దూషించిన ఘటన సంగారెడ్డి జిల్లా కందిలో వెలుగు చూసింది. కంది గ్రామ పంచాయతీలో కార్మికుడిగా పనిచేస్తున్న శివరాజ్‌ గతంలో ఓ ప్రైవేటు పాఠశాల భవన నిర్మాణానికి 14 గుంటల స్థలం విక్రయించారు. పాఠశాల ఏర్పాటు కోసం కావడంతో మార్కెట్‌ ధర కంటే తక్కువకే భూమిని ఇచ్చారు. దీంతో ఆయన ఇద్దరు కూతుళ్లను 10వ తరగతి వరకు నామమాత్రపు ఫీజుతో చదివిస్తామని సదరు పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఇద్దరు కూతుళ్లకు సంబంధించి ప్రతీ సంవత్సరం శక్తిమేరకు ఫీజు కడుతున్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఫీజులో కొంత మొత్తం ఇంకా చెల్లించాల్సి ఉన్నది. కాగా మంగళవారం స్కూల్‌ యాజమాన్యం విద్యార్థులను పిలిపించి ఫీజు బకాయిలు చెల్లించాలని, ఇన్నేళ్లుగా మిగిలిన విద్యార్థులు చెల్లించిన మొత్తం లెక్కగట్టి, పాత బకాయిలు కూడా కట్టాల్సిందేనని హుకుం జారీ చేశారు. అంతటితో ఆగకుండా విద్యార్థినులతో టీసీ కావాలని బలవంతంగా అప్లికేషన్‌ రాయించుకున్నారు. తోటి పిల్లల ముందే దూషించడంతో విద్యార్థినులు కన్నీరుమున్నీరవుతూ ఇంటికి వెళ్లారు. దీనిపై విద్యార్థినుల తండ్రి మాట్లాడుతూ స్కూల్‌ కడతామంటే గ్రామానికి ఉపయోగపడుతుందని తక్కువ ధరకే భూమి ఇచ్చానని, అప్పట్లో తన పిల్లలను చదివిస్తామని ఒప్పుకున్న యాజమాన్యం ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తోటి విద్యార్థుల ముందు దూషించడమే కాకుండా ఇన్నేళ్ల బకాయి కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని, పంచాయతీ కార్మికుడిగా పనిచేసే తాను ఎలా కట్టగలనని వాపోతున్నారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేసి పిల్లల చదువు కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-12-15T23:49:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising