ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పకడ్బందీగా సీఎ్‌సఆర్‌ నిధుల పర్యవేక్షణ

ABN, First Publish Date - 2022-12-31T23:15:18+05:30

జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎ్‌సఆర్‌) నిధులను అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ సీఎ్‌సఆర్‌ నిధుల పర్యవేక్షణ కమిటీ అధికారులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శరత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగారెడ్డి టౌన్‌, డిసెంబరు 31: జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ(సీఎ్‌సఆర్‌) నిధులను అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ సీఎ్‌సఆర్‌ నిధుల పర్యవేక్షణ కమిటీ అధికారులకు సూచించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం సీఎ్‌సఆర్‌ నిధుల పర్యవేక్షణ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో క్లస్టర్ల వారీగా నివేదికలు, అధికారులు చేపట్టిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కంపెనీల యాక్టు ప్రకారం సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సీఎ్‌సఆర్‌ కింద నిధులను కలెక్టర్‌ ఖాతాలో జమ చేయాలన్నారు. ఈ నిధులను రాబట్టడానికి పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలోని అధికారులు వారికి కేటాయించిన క్లస్టర్లలోని పరిశ్రమలన్నింటిని మరో మారు పరిశీలించి సీఎ్‌సఆర్‌ నిధుల వివరాలను సేకరించి నివేదికను అందజేయాలన్నారు. కంపెనీ యాక్టు నిబంధనల మేరకు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలకు సీఎ్‌సఆర్‌ గైడ్‌లైన్స్‌, చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు రాజార్షిషా, వీరారెడ్డి, సీపీవో తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:15:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising