ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఇబ్బందిపెడితే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-05-21T05:04:27+05:30

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు.

మల్లుపల్లిలో రైతులతో మాట్లాడుతున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిరుదొడ్డి, మే 20: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు హెచ్చరించారు. శుక్రవారం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడారు. అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోళ్లలో వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. మ్యాచర్‌పేరుతో రైస్‌మిల్లర్లు రైతులను మోసం చేస్తే వారిపట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట బీజేపీ మిరుదొడ్డి మండలాధ్యక్షుడు దేవరాజు, నాయకులు కనకరాజు, శ్రీనివాస్‌, ప్రవీన్‌ తదితరులున్నారు. 


 

Updated Date - 2022-05-21T05:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising