కేసుల ఛేదనను ఛాలెంజ్‌గా తీసుకోవాలి: ఎస్పీ
ABN, First Publish Date - 2022-11-15T00:26:40+05:30
కేసుల ఛేదన ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని పోలీస్ అధికారులకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ ఆదేశించారు.
సంగారెడ్డి రూరల్, నవంబరు14, కేసుల ఛేదన ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని పోలీస్ అధికారులకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ ఆదేశించారు. సంగారెడ్డిలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ తదితర కేసుల్లో ఇన్వెస్టిగేషన్ త్వరిగతిన పూర్తి చేసి 60 రోజుల్లోగా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. కేసుల ఛేదన చాలెంజ్‌గా తీసుకుని ఆధునిక టెక్నాలజీ ద్వారా త్వరగా ఛేదించాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఉషావిశ్వనాథ్, జహీరాబాద్, నారాయణఖేడ్ డీఎస్పీలు రఘు, బాలాజీ, ఎస్‌బీ సీఐ మహే్‌షగౌడ్, డీసీఆర్‌బీ సీఐ జలందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-15T00:26:42+05:30 IST