గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించండి
ABN, First Publish Date - 2022-12-16T23:49:54+05:30
మండల సమావేశంలో సభ్యుల డిమాండ్
కోహీర్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు
జహీరాబాద్, డిసెంబరు 16: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోరారు. శుక్రవారం కోహీర్‌లో ఎంపీపీ బి.మాధవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంపీడీవో సుజాతనాయక్ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీవో వెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ రాందాస్, వైస్ ఎంపీపి శాకిర్ అలీ, ఎంపీడీవో సుజతనాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:49:55+05:30 IST