ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆబ్కారీ శాఖలో అధికారుల కొరత

ABN, First Publish Date - 2022-10-17T05:30:00+05:30

సర్కారుకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆబ్కారీ శాఖలో అధికారుల కొరత నెలకొన్నది. కీలకమైన స్థానాల్లో అధికారులు లేకపోవడంతో శాఖాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గడిచిన ఆరునెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పరిష్కారం లభించలేదు. కీలకమైన సిద్దిపేట, హుస్నాబాద్‌ స్టేషన్లతోపాటు డిస్ర్టిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి సీఐలు లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది.

సిద్దిపేట జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు సీఐ పోస్టుల్లో మూడు ఖాళీ

సిద్దిపేట, హుస్నాబాద్‌, డీటీఎ్‌ఫలపై పట్టింపేది

ఇన్‌చార్జిలుగా జూనియర్‌ ఎస్‌ఐలు

ఏఈఎస్‌ పోస్టు మంజూరైనా భర్తీ లేదు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 17 : సర్కారుకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆబ్కారీ శాఖలో అధికారుల కొరత నెలకొన్నది. కీలకమైన స్థానాల్లో అధికారులు లేకపోవడంతో శాఖాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గడిచిన ఆరునెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పరిష్కారం లభించలేదు. కీలకమైన సిద్దిపేట, హుస్నాబాద్‌ స్టేషన్లతోపాటు డిస్ర్టిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగానికి సీఐలు లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. 


ఆరునెలలుగా ఇన్‌చార్జిలే

జిల్లాలో సిద్దిపేట, హుస్నాబాద్‌, గజ్వేల్‌, మిరుదొడ్డి, చేర్యాలలో ఎక్సైజ్‌ స్టేషన్లు ఉన్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ల పర్యవేక్షణలో ఈ స్టేషన్లు ఉంటాయి. అదేవిధంగా డిస్ర్టిక్ట్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం(డీటీఎ్‌ఫ)కు ఒక సీఐ ఉంటారు. మొత్తంగా ఆరుగురు సీఐలు పనిచేయాల్సి ఉండగా ఇందులో మూడు చోట్లా ఖాళీలే ఉన్నాయి. సిద్దిపేట సీఐగా ఉన్న చాణక్యకు ఏఈఎ్‌సగా పదోన్నతి లభించడంతో ఆయన స్థానం ఖాళీ ఏర్పడింది. ఇక్కడ పనిచేస్తున్న ఎస్‌ఐ ఇన్‌చార్జిగా ఉన్నారు. హుస్నాబాద్‌ సీఐగా ఉన్న విజయలక్ష్మీ ఆరునెలల క్రితం సెలవు పెట్టింది. అప్పటి నుంచి ఇన్‌చార్జిగా ఆస్టేషన్‌ ఎస్‌ఐ వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన డీటీఎఫ్‌ విభాగానికి కూడా సీఐ లేకపోవడంతో ఆ ఇన్‌చార్జి బాధ్యత ఓ ఎస్‌ఐ చూస్తున్నారు. ఇలా మూడు కీలకమైన స్థానాల్లో సీఐలకు బదులు జూనియర్‌ ఎస్‌ఐలకు బాధ్యతలు అప్పగించడం విమర్శలకు తావిస్తోంది. 


భర్తీకాని ఏఈఎస్‌ పోస్టు

కాగా సిద్దిపేట జిల్లా కేంద్రం కాకముందు ఇక్కడ సీఐ స్థాయి అధికారి మాత్రమే ఉండేవారు. జిల్లా ఆవిర్భవించిన తర్వాత ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఏర్పాటైంది. జిల్లాలోని ఐదు ఎక్సైజ్‌ స్టేషన్లు, డీటీఎఫ్‌ ఇతర విభాగాలను ప్రస్తుతం ఈఎస్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే వైన్‌షాపులు, బార్ల సంఖ్య పెరగడంతోపాటు మద్యం విక్రయాల టార్గెట్లు కూడా పెంచారు. దీంతో సిద్దిపేటకు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టును సైతం మంజూరు చేశారు. కానీ ఇంతవరకు నియామకం చేపట్టలేదు. ఓ పక్క ముగ్గురు సీఐలు లేక, మరోవైపు ఏఈఎస్‌ పోస్టు భర్తీకాకపోవడంతో ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు అదనపు పనిభారం తప్పడం లేదు. 


పర్యవేక్షణ లేక పక్కదారి

సీఐల పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో మద్యం విక్రయాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కుకునూరుపల్లిలోని ఓ వైన్స్‌లో లిక్కర్‌లో నీళ్లు కలిశాయనే ఆరోపణలు రావడంతో సంగారెడ్డి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వచ్చి కేసు నమోదు చేశారు. స్థానిక అధికారులకు ఫిర్యాదులున్నా పట్టించుకోన్నట్లు తెలిసింది. మరో ఒకట్రెండు విషయాల్లోనూ జిల్లా అధికారులకు బదులు ఇతర ప్రాంతాల వారే ఇక్కడ దాడులు చేయడం గమనార్హం. అంతేగాకుండా పూర్తిగా నియంత్రణలో ఉన్న గుడుంబా తయారీ మళ్లీ మొదలైంది. దసరాకు ముందు అక్కన్నపేట, మద్దూరు, దూళిమిట్ట మండలాల్లో దాడులు జరిపి కేసులు సైతం నమోదు చేశారు. ఇప్పటికి కూడా పలుచోట్ల గుడుంబా తయారవుతుందన్న ఫిర్యాదులు ఉన్నప్పటికీ దాడులు చేయడం లేదనే చర్చ జరుగుతోంది. సిద్దిపేట స్టేషన్‌లో ముగ్గురు ఎస్‌ఐలు, ఎప్పటికప్పుడు ఈఎస్‌ పర్యవేక్షణ ఉన్నందున ఇక్కడ సమస్య లేదు. కానీ హుస్నాబాద్‌తోపాటు డీటీఎఫ్‌ విభాగానికి వెంటనే సీఐలను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising