ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాధరి క్షేత్రంలో వైభవంగా శని త్రయోదశి మహోత్సవం

ABN, First Publish Date - 2022-05-29T05:08:12+05:30

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలోని శనైశ్ఛరాలయంలో శనివారం శని త్రయోదశి మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.

వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌, మే 28: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలోని శనైశ్ఛరాలయంలో శనివారం శని త్రయోదశి మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్‌ యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం అంకురార్పణతో పూజలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మకర, కుంభ, మీన రాశుల వారికి సాడేసాత్‌ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శనీ, కర్కాటక రాశి వారికి అష్టమ శని ఉన్నదున్న ఆలయ ప్రాంగణంలో సామూహిక శని పూజలు నిర్వహించి శనీశ్వరుడికి తైలాభిషేకాలు నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొని శని దోష నివారణ కోసం పూజలు చేశారు. అనంతరం క్షేత్రంలోని విద్యా సరస్వతీ అమ్మవారి దర్శనంతో పాటు ఉప ఆలయాలైన లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేడుకల సందర్భంగా విద్యాధరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 

Updated Date - 2022-05-29T05:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising