ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

ABN, First Publish Date - 2022-06-27T04:56:26+05:30

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని, ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన రేగోడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

రేగోడు మండలంలోని బసవేశ్వర చౌక్‌ వద్ద పోలీసులు పట్టుకున్న పశువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురిపై కేసు నమోదు

 రేగోడు జూన్‌ 26: పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని, ముగ్గురిపై కేసు నమోదు చేసిన ఘటన రేగోడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సత్యనారాయణ వివరాల ప్రకారం.. రేగోడు బసవేశ్వరచౌక్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా పెద్ద శంకరంపేట్‌ నుంచి వస్తున్న కేఏ38ఏ0481 బొలెరో వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో ఐదు ఆవులు, రెండు కోడెలను కుక్కి తరలించడాన్ని గమనించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా  పశువులను వధించేందుకు పెద్దశంకరంపేట మండలంలోని కోలపల్లి నుంచి బీదర్‌ తీసుకెళ్తున్నట్లు అంగీకరించారు. డ్రైవర్‌ ఎక్బాల్‌ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ కాగా, వ్యాపారి అష్రోజ్‌, కూలీ జాబేర్‌లది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ గ్రామంగా గుర్తించారు. వాహనాన్ని సీజ్‌ చేసి, ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు. 

Updated Date - 2022-06-27T04:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising