పందిల్ల శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
ABN, First Publish Date - 2022-10-18T05:15:20+05:30
హుస్నాబాద్ మండలం పందిల్ల శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న సంఘటనలో కొడుకు మృతిచెందగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.
కొడుకు మృతి, తండ్రి పరిస్థితి విషమం
హుస్నాబాద్‌రూరల్, అక్టోబరు 17: హుస్నాబాద్ మండలం పందిల్ల శివారులోని రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలో సోమవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న సంఘటనలో కొడుకు మృతిచెందగా, తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన తండ్రి కొడుకులు ముప్పు అశోక్(33), ముప్పు వీరస్వామి బైక్‌పై హుస్నాబాద్ మండలం రేగొండ గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. పందిల్ల సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయ సమీపంలోకి రాగానే నాగసముద్రాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొన్నది. దీంతో అశోక్ అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి వీరస్వామి తలకు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రి వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం అశోక్ మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2022-10-18T05:15:20+05:30 IST