ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌడారంలో రూ. 10.56 కోట్లతో మెగా వాటర్‌షెడ్‌

ABN, First Publish Date - 2022-02-20T05:16:45+05:30

చిన్నకోడూరు మండలం చౌడారంలో మెగా వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 10.56 కోట్లు మంజూరైనట్టు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. చౌడారం మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు నిర్మాణంతో చౌడారం, విఠలాపూర్‌, మేడిపల్లి, అల్లీపూర్‌, కిష్టాపూర్‌, మైలారం, కమ్మర్లపల్లి, చెల్కలపల్లి, ఎల్లాయపల్లికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు


చిన్నకోడూరు, ఫిబ్రవరి 19 : చిన్నకోడూరు మండలం చౌడారంలో మెగా వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 10.56 కోట్లు మంజూరైనట్టు ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. చౌడారం మెగా వాటర్‌షెడ్‌ ప్రాజెక్టు నిర్మాణంతో చౌడారం, విఠలాపూర్‌, మేడిపల్లి, అల్లీపూర్‌, కిష్టాపూర్‌, మైలారం, కమ్మర్లపల్లి, చెల్కలపల్లి, ఎల్లాయపల్లికి ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. 4,803 హెక్టార్లలో వాటర్‌ షెడ్‌ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామాల స్వరూపం మారనుందని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చెక్‌డ్యామ్‌, చెరువులు, కుంటలు, రాతి కట్టడాలు, భూగర్భ నీటి పెంపుదల వంటి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. వ్యవసాయ ఉత్పాదక పనిముట్లు, రైతులకు అవసరమయ్యే టార్పాలిన్‌ కవర్లు, స్ర్పెయర్లు, స్పింక్లర్లు అందజేస్తామని, భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని మంత్రి వివరించారు.


Updated Date - 2022-02-20T05:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising