ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దిపేట జిల్లాలో రూ.20 కోట్లు తాగేశారు!

ABN, First Publish Date - 2022-10-08T05:21:30+05:30

సిద్దిపేట పట్టణంలోని ఓ వైన్‌షాపులో నిత్యం సుమారుగా రూ.3లక్షల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. తాజాగా దసరా పర్వదినం రోజున ఇదే షాపులో రూ.10లక్షల పైచిలుకు అమ్మకాలు జరిగాయి. ఇదే తరహాలోనే జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు దసరా సందర్భంగా కిక్కిరిసిపోయాయి. గురువారం కూడా దసరా పేరిట మద్యం ప్రియులు తెగ తాగేశారు. ఫలితంగా పండుగకు రికార్డుస్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరాకి జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు

ఒక్కరోజులో మూడింతల అమ్మకాలు

పది నెలల్లోనే రూ.వెయ్యి కోట్లకు చేరువలో


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, అక్టోబరు 7 : సిద్దిపేట పట్టణంలోని ఓ వైన్‌షాపులో నిత్యం సుమారుగా రూ.3లక్షల విలువైన మద్యం విక్రయాలు జరుగుతాయి. తాజాగా దసరా పర్వదినం రోజున ఇదే షాపులో రూ.10లక్షల పైచిలుకు అమ్మకాలు జరిగాయి. ఇదే తరహాలోనే జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు దసరా సందర్భంగా కిక్కిరిసిపోయాయి. గురువారం కూడా దసరా పేరిట మద్యం ప్రియులు తెగ తాగేశారు. ఫలితంగా పండుగకు రికార్డుస్థాయిలో  మద్యం అమ్మకాలు కొనసాగాయి. 

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 93 వైన్‌షాపులు, 13 బార్లు ఉన్నాయి. ప్రతీనెల ఇంచుమించుగా రూ.60 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతున్నది. ప్రభుత్వం నుంచి ధరలు పెంచినప్పటికీ, ఇతర నిబంధనలు విధించినప్పటికీ మద్యం అమ్మకాలపై ప్రభావం చూపించడం లేదు. 


దసరాకు మస్తు కిక్కు

దసరా పండుగ అంటేనే మద్యం, మాంసం తప్పనిసరిగా ఉండాల్సిందే. గతంలో తాటి, ఈత కల్లుకు గ్రామాల్లో అధిక ప్రాధాన్యం ఉండేది. కానీ పండుగ సందర్భంగా మద్యానికే మొగ్గుచూపిస్తున్నారు. దసరాకు ఒకరోజు ముందుగానే పెద్దఎత్తున బెల్టుషాపులకు మద్యం చేరింది. అదేవిధంగా మద్యం ప్రియులు సైతం ముందస్తుగానే మద్యం సీసాలు కొనుగోలు చేశారు. వైన్‌షాపుల ఎదుట పోటీపడిన పరిస్థితి నెలకొన్నది. తమ బ్రాండ్ల కోసం మద్యం ప్రియులు ఆరాటపడ్డారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారు సాధారణంగా రాత్రి సమయాల్లో ఆసక్తి చూపిస్తారు. కానీ పండుగ సందర్భంగా ఉదయం నుంచే నిమగ్నమయ్యారు. బంధువులు, మిత్రులతో సందడిగా ఉంటూ విందులు చేసుకున్నారు. అందుకే ఒకేరోజు మూడింతల మద్యం సీసాలు ఖాళీ అయ్యాయి. ఈనెల 3, 4, 5 తేదీల్లో వైన్‌షాపుల్లో ఉన్న రూ.20కోట్ల పైచిలుకు మద్యం నిల్వలు అమ్ముడుపోయాయి. గతేడాది రూ.13 నుంచి రూ.15 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా ఈసారి అదనంగా రూ.5 కోట్ల ఎక్కువ అమ్మకాలు చోటు చేసుకున్నాయి.


5 లక్షల బీర్లు తాగేశారు

కాగా దసరా సందర్భంగా విక్రయించిన మద్యం నిల్వల్లో బీర్లతోపాటు అధికశాతం స్కాచ్‌ విస్కీ సీసాలు ఉన్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో 42,548 బీర్ల పెట్టెలు అమ్ముడుపోయాయి. ఒక్కో పెట్టెలో 12 బీరు సీసాలు ఉంటాయి. ఈ లెక్కన 5.10లక్షల బీర్లను తాగేసినట్లు అంచనా. ఇక 17,373 లిక్కర్‌ పెట్టెల్లో 2లక్షలకుపైగా మద్యం బాటిళ్లు ఉంటాయి. ఒకప్పుడు రూ. వెయ్యి లోపు ఉన్న ఫుల్‌బాటిళ్లు ఎక్కువగా విక్రయించేవారమని, గడిచిన రెండేళ్ల నుంచి స్కాచ్‌, బ్లెండెడ్‌, ఆపైన ఉన్నటువంటి బ్రాండ్ల మద్యం ఎక్కువగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. 


మొదటిసారి రూ.వెయ్యి కోట్లకు

మద్యం విక్రయాల్లో సిద్దిపేట జిల్లా కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. 2020 డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 2021 నవంబరు 30 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రూ.749.41 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. ఇందులో 8,79,492 మద్యం పెట్టెలు, 8,94,274 బీర్ల పెట్టెలు ఉన్నాయి. ఇక 2021 డిసెంబరు 1వ తేదీ నుంచి గడిచిన సెప్టెంబరు 30వ తేదీ వరకే రూ.873.90 కోట్ల మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. జిల్లా ఆబ్కారీ ఆదాయ పరంగా ఇది రికార్డుగా భావించవచ్చు. ఏడాది గడువుకు మరో రెండు నెలల సమయం ఉన్నప్పటికీ రూ.873 కోట్లు దాటడంతో మిగతా గడువులో రూ.వెయ్యి కోట్లను దాటే అవకాశం లేకపోలేదు. అక్టోబరు మొదటి వారంలోనే జిల్లా వ్యాప్తంగా రూ.25 కోట్ల మద్యం వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.900 కోట్ల వ్యాపారం దాటినట్లేనని చెప్పకతప్పదు. మద్యం విక్రయాల్లో రూ. వెయ్యి కోట్ల మార్కును సిద్దిపేట జిల్లా చేరుకోవడం ఇదే మొదటిసారి కావడం కొసమెరుపు. 

Updated Date - 2022-10-08T05:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising