ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షంతో కోతకు గురైన రోడ్లు

ABN, First Publish Date - 2022-06-27T05:26:24+05:30

ఖేడ్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండ పోత వర్షం కురియడంతో పలు చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి.

ఖేడ్‌ మండలం నాగాపూర్‌ వద్ద కోతకు గురైన రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణఖేడ్‌, జూన్‌ 26: ఖేడ్‌ ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండ పోత వర్షం కురియడంతో పలు చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఖేడ్‌ - కంగ్టి రోడ్డులో మండలంలోని నాగాపూర్‌ వద్ద రోడ్డు కోతకు గురైంది. ఏడాదిక్రితం సైతం ఈప్రాంతంలోనే రోడ్డు కోతకు గురి కాగా పలు ప్రమాదాలు జరిగాయి. నాలుగు నెలల క్రితం గోతిని పూడ్చినా ప్రస్తుతం మళ్లీ కోతకు గురైంది. ఖేడ్‌ మున్సిపల్‌ పరిధిలోని మన్సూర్‌పూర్‌ వద్ద సైతం రోడ్డు కోతకు గురైంది. ఈ మార్గం గుండా కల్హేర్‌, సిర్గాపూర్‌ మండలాలతో పాటు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగుతుంటాయి. రాకపోకలు భారీగా కొనసాగే ఆయా రోడ్లు కోతకు గురవవ్వడంతో ముఖ్యంగా రాత్రుల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 




Updated Date - 2022-06-27T05:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising