ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనుల బిల్లులను విడుదల చేయండి

ABN, First Publish Date - 2022-12-16T23:51:49+05:30

అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని, నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు.

వెల్దుర్తి మండల సమవేశంలో లబ్ధిదారులకు షాదీముబారక్‌ చెక్కులను అందజేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, డిసెంబరు 16: ఎంపీపీ స్వరూప అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని, నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదని సర్పంచులు సభ దృష్టికి తెచ్చారు. బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. త్వరలో బిల్లులు వచ్చేలా చూస్తామని ఎంపీడీవో హామీ ఇచ్చారు. గ్రామాల్లో రోడ్ల మరమ్మతుకు రూ.9.2 కోట్లు, మన ఊరు-మన బడి కార్యక్రమానికి రూ.6 కోట్లు మంజూరయినట్లు పీఆర్‌ ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. పశువుల తొట్ల బిల్లులను జనవరిలో మంజూరు చేయిస్తామని ఏపీఓ రాజు తెలిపారు. మహిళా సమాఖ్యలో అందరికీ సమాచారం ఇచ్చి మహిళా సంఘాలకు ఐకేపీ రుణాలు అందేలా చూడాలని జడ్పీటీసీ రమే్‌షగౌడ్‌ సూచించారు. వ్యవసాయ సాగుకు ఎన్ని గంటల విద్యుత్తు సరఫరా చేస్తున్నారో తెలుపాలని విద్యుత్‌ అధికారులను వైస్‌ ఎంపీపీ సుధాకర్‌గౌడ్‌ సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. తహసీల్దార్‌ సురే్‌షకుమార్‌, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising