రైతుబంధు నమోదుకు ఈ నెల 10 వరకు అవకాశం
ABN, First Publish Date - 2022-07-09T05:11:04+05:30
రైతుబంధు నమోదుకు ఈ నెల 10తేదీ వరకు అవకాశముందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
గుమ్మడిదల, జూలై 8: రైతుబంధు నమోదుకు ఈ నెల 10తేదీ వరకు అవకాశముందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు రైతుబంధు పథకంలో నమోదు కాని రైతులు తమ పట్టా పాసుబుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, దరఖాస్తు ఫారం తీసుకొని సమీపంలోని మండల వ్యవసాయ కేంద్రంలో ఉండే ఏఈవోకు ఇచ్చి రైతు బంధు పథకంలో పేరు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు.
Updated Date - 2022-07-09T05:11:04+05:30 IST