ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రియల్‌’ మాయ

ABN, First Publish Date - 2022-12-16T00:20:20+05:30

వరంగల్‌ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ చిట్‌ఫండ్‌ కంపెనీకి చెందిన స్థలం ఇది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ-బందారం గ్రామాల శివారులో ఉంది. ఇక్కడ ఎలాంటి వెంచర్‌ లే-అవుట్‌ డిజైన్‌ లేకున్నప్పటికీ ప్లాట్ల విక్రయాలు జోరందుకున్నాయి. కాగితాల్లో మ్యాపులు చూపిస్తూ అడ్వాన్సులు స్వీకరించే పనిలో ఉన్నారు. వందకు పైగానే ప్లాట్లు ఉన్నట్లుగా డమ్మీ మ్యాపులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు.’

కొండపాక మండలం దుద్దెడ శివారులో వెంచర్‌ కోసం తొలగిస్తున్న చెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేఅవుట్‌ లేకముందే అమ్మకాలు

కాగితాలు చూపించి అడ్వాన్సుల స్వీకరణ

చెట్లు నరికి రాత్రికిరాత్రే బుగ్గిపాలు

యథేచ్ఛగా నిబంధనల అతిక్రమణ

ప్రేక్షకపాత్రలో సంబంధిత అధికారులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 15 : ‘వరంగల్‌ ప్రధాన కేంద్రంగా నిర్వహిస్తున్న ఓ చిట్‌ఫండ్‌ కంపెనీకి చెందిన స్థలం ఇది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ-బందారం గ్రామాల శివారులో ఉంది. ఇక్కడ ఎలాంటి వెంచర్‌ లే-అవుట్‌ డిజైన్‌ లేకున్నప్పటికీ ప్లాట్ల విక్రయాలు జోరందుకున్నాయి. కాగితాల్లో మ్యాపులు చూపిస్తూ అడ్వాన్సులు స్వీకరించే పనిలో ఉన్నారు. వందకు పైగానే ప్లాట్లు ఉన్నట్లుగా డమ్మీ మ్యాపులు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు.’

‘సిద్దిపేట అర్బన్‌ మండలం పొన్నాల శివారులో ఉన్న స్థలం ఇది. రాజీవ్‌ రహదారి పక్కనే ఉన్న ఈ వ్యవసాయ భూమిని ఇటీవల చదును చేశారు. ఇదే భూమిలో నుండి కల్వర్టుకు సంబంధించిన కాలువ ఉంది. భవిష్యత్తులో ఇక్కడ నిర్మాణాలు చేపడితే కల్వర్టు ద్వారా ప్రవహించే వరద నీళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉంది. ’

ఈ సంఘటనలు జిల్లాలో ఇటీవల చేపట్టిన పలు రియల్‌ వెంచర్లకు తార్కాణంగా నిలుస్తున్నాయి. ఇలాగే వందల కొద్ది వెంచర్లను జిల్లాలో చేపడుతున్నారు. అరుదుగా మినహాయిస్తే దాదాపు అన్ని వెంచర్లు నిబంధనలకు విరుద్దంగానే ఉన్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నాలా అనుమతితోనే విక్రయాలు

వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చాలంటే ముందుగా రెవెన్యూ శాఖ నుండి నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌ ఏరియా(నాలా)గా అనుమతి పొందాలి. ఆ తర్వాత సంబంధిత గ్రామపంచాయతీ నుండి ఎన్‌ఓసీ తీసుకొవాలి. ఇందుకు సదరు గ్రామపంచాయతీకి భూమిలో 10 శాతం కేటాయించాలి. ఈ స్థలంలో పార్కు, ఇతర మౌళిక వసతులు నిర్మించాల్సి ఉంటుంది. ఇక లేఅవుట్‌ రూపొందించాలంటే డీటీసీపీ ప్లానింగ్‌ ప్రకారం అనుమతి తీసుకోవాలి. ప్రతీ గజం లెక్కన ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి. ఇవన్నీ పూర్తయ్యాకనే ప్లాట్ల విక్రయం ప్రారంభించాలి. ఇలా చేస్తే కొనుగోలు చేసిన వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇవేవీ లేకుండానే కేవలం నాలా అనుమతితో వెంచర్లు తయారుచేసి కాగితాల్లో మ్యాపులు చూపిస్తూ విక్రయిస్తున్న పరిస్థితి జిల్లాలో నెలకొన్నది.

ఎడాపెడా రిజిస్ర్టేషన్లు

డీటీసీపీ అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రిజిస్ర్టేషన్లు చేయాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఎడాపెడా రిజిస్ర్టేషన్‌లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ఉన్న వెంచర్లకు సంబంధించిన ప్లాట్లు రిజిస్ర్టేషన్‌ చేయాలంటే కార్యాలయాల్లో చేతులు తడపక తప్పడం లేదనే విమర్శలు నెలకొన్నాయి. ఇప్పటికే జిల్లాలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ భూములను తహసీల్దార్లకు అప్పగించడంతో.. మిగిలిన ఈ ప్లాట్ల రిజిస్ర్టేషన్లపై అధిక ఫోకస్‌ పెట్టి అందినకాడికి దండుకుంటున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అన్నీ సజావుగా జరిగి రిజిస్ర్టేషన్లు అయినప్పటికీ మళ్లీ ఇంటి నిర్మాణానికి ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - 2022-12-16T00:20:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising