ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంతమందికైనా ఇవ్వడానికి సిద్ధం

ABN, First Publish Date - 2022-08-04T05:53:15+05:30

ఎవరూ అధైర్యపడొద్దని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు. ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు.

ములుగు మండలం చిన్నతిమ్మాయిపల్లిలో లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలను అందిస్తున్న మంత్రి హరీశ్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు అందజేస్తాం

ధరణి పోర్టల్‌తో భూ సమస్యలను పరిష్కరించాం

రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


ములుగు/జగదేవ్‌పూర్‌, ఆగస్టు 3 : ఎవరూ అధైర్యపడొద్దని, సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు అందజేస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసానిచ్చారు. ఎంతమంది ఇల్లు కట్టుకుంటే అంతమందికి డబ్బు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం ములుగు మండలం చిన్నతిమ్మాయపల్లి, నాగిరెడ్డిపల్లి, మర్కుక్‌ మండలం శివారు వెంకటాపూర్‌ గ్రామాల్లో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లుకు రూ.60 వేలు ఇస్తే బేస్మెంట్‌కు కూడా సరిపోయేది కాదని విమర్శించారు. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దూరదృష్టితో ఆలోచన చేసి డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను నిర్మించి అందిస్తున్నామని తెలియజేశారు. పేదలు ఇళ్లల్లోకి చేరుకోగానే వారి ముఖంలో చూసిన ఆనందానికి వెలకట్టలేమన్నారు. ప్రధానమంత్రి మోదీ ఉచితాలు వద్దని చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఉచితాలు వద్దన్న బీజేపీ మనకొద్దని మంత్రి పిలుపునిచ్చారు. ఉపాధిహామీ పనికి రెండుసార్లు వచ్చి ఫొటో దిగితేనే పైసలు ఇస్తామని మోదీ ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులు, పేదల సంక్షేమం కోసమే ఆలోచన చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ములుగు జడ్పీటీసీ జయమ్మఅర్జున్‌గౌడ్‌, ఎంపీపీ లావణ్యాఅంజన్‌గౌడ్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, మర్కుక్‌ జడ్పీటీసీ మంగమ్మరామచంద్రం, ఎంపీపీ తాండ పాండుగౌడ్‌, జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ సలీం, డీసీసీబీ డైరెక్టర్‌ బట్టు అంజిరెడ్డి, సర్పంచుల పోరం అధ్యక్షుడు గంగిశెట్టి గణే్‌షగుప్తా, ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు దుంబాల లింగారెడ్డి, సర్పంచ్‌ మంజులానర్సింలు, ఏఎంసీ చైర్మన్‌లు జహంగీర్‌, మాదాసు శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మర్కుక్‌ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రెవెన్యూ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు.


102 మందికి పాస్‌పుస్తకాలు

ధరణి పోర్టల్‌తో భూ సమస్యలను పరిష్కరించామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్న ఆలోచనతో ములుగును పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నామని మంత్రి తెలిపారు. గత నెలలో 15 రోజులపాటు కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు ములుగు గ్రామపంచాయతీలో భూ సమస్యలు పరిష్కరించడానికి రైతుల నుంచి 118 దరఖాస్తులను తీసుకున్నామన్నారు. 102 సమస్యలను పరిష్కరించి, వారికి పాస్‌ పుస్తకాలను అందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి రైతులకు ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశం అన్నారు. రైతుల నుంచి ఏ అధికారి కూడా నయా పైసా తీసుకోకుండా పనిచేసే పెట్టారని అధికారుల పనితీరును మెచ్చుకున్నారు.


లక్ష్యం మేరకు ఆయిల్‌పామ్‌ మొక్కలను పంపిణీ చేయాలి

ములుగులో ఫారెస్ట్‌ కళాశాల వద్ద పెంచుతున్న ఆయిల్‌పామ్‌ మొక్కల నర్సరీని బుధవరాం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. రైతులకు సరిపోయేలా మొక్కలు అందించకపోవడంపై కాంట్రాక్టరు, ఆయిల్‌ ఫెడ్‌ అధికారుల తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత నెల లక్ష్యం మేరకు అందించాల్సిన ఆయిల్‌పామ్‌ మొక్కలు అందకపోవడంపై అగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటికే 2వేల ఎకరాలలో ఆయిల్‌పామ్‌ తోటలను పెంచేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని అందుకు అనుగుణంగా మొక్కలను పంపిణీ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రామలక్ష్మి, ఆయిల్‌ ఫెడ్‌ జిల్లా ఇన్‌చార్జి శంకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-04T05:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising