ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌యార్డులో సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-23T04:42:27+05:30

ధాన్యం కొనుగోలు విషయంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

చేర్యాల మార్కెట్‌యార్డు ఆవరణలో రాస్తారోకో చేస్తున్న రైతు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేర్యాల, మే 22: ధాన్యం కొనుగోలు విషయంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్‌యార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. మార్కెట్‌ కమిటీ కార్యాలయం ఎదుట జనగామ-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు నక్కల యాదవరెడ్డి మాట్లాడుతూ మార్కెట్‌లో విద్యుత్‌ సమస్య నెలకొనడంతో తూర్పార పట్టుకోవడానికి రైతులు ఇబ్బందులు పడటంతో పాటు రాత్రివేళ చీకట్లో భయాందోళనకు గురవుతున్నారన్నారు. ప్రతీ రైతుకు వెంటనే టోకెన్లు అందించి 24 గంటలు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, తేమ, తాలు పేరిట దోపీడికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రాస్తారోకోకు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కత్తుల భాస్కర్‌రెడ్డి, పోనుగోటి శ్రీనివా్‌సరెడ్డి, మల్లేశం, రాజయ్య, ఎల్లమ్మ, రాజమణి, పోచవ్వ, నరహరి పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising