ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి: ఎస్పీ
ABN, First Publish Date - 2022-10-18T05:02:01+05:30
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిని పేర్కొన్నారు.
మెదక్ అర్బన్, అక్టోబరు 17: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా ఎస్పీ రోహిణీప్రియదర్శిని పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఫోన్‌లో ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి పలు ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.
Updated Date - 2022-10-18T05:02:01+05:30 IST