ప్రజాసమస్యల పరిష్కారానికి ‘ప్రజావాణి’
ABN, First Publish Date - 2022-11-28T23:26:39+05:30
ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
సిద్దిపేట అగ్రికల్చర్, నవంబరు 28 : ప్రజాసమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంద్వారా ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లా డి సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఆసరా పింఛన్ల, ఇతర సమస్యలు కలిపి మొత్తం 100 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. అర్జీదారులకు న్యాయం చేయాలని, మరోసారి ఫిర్యాదు చేయకుండా సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ గోపాల్‌రావు, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
Updated Date - 2022-11-28T23:26:40+05:30 IST