ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజావాణి’ని సద్వినియోగం చేసుకోవాలి : కనకరాజు

ABN, First Publish Date - 2022-05-24T05:05:27+05:30

సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట టౌన్‌, మే 23: సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జంగిటి కనకరాజు సూచించారు. సోమవారం సిద్దిపేట పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా పలు సమస్యలపై ప్రజలు ఫిర్యాదులను అందించారు. ఈ సందర్భంగా జంగిటి కనకరాజు మాట్లాడుతూ పలు సమస్యలపై ప్రజావాణిలో 6 దరఖాస్తులు వచ్చాయని, వచ్చిన వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. వీటిలో టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించి 2, రెవెన్యూకు సంబంధించి 1, శానిటేషన్‌కు సంబంధించి 2, ట్రాఫిక్‌కు సంబంధించి 1 దరఖాస్తు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ శ్రీనివా్‌సరెడ్డి, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ పరిధిలో లేకున్నా అనుమతి ఇచ్చారు

సిద్దిపేట అర్బన్‌ మండలంలోని మిట్టపల్లి గ్రామపంచాయతీకి చెందిన భూముల్లో ఓ వ్యక్తి సిద్దిపేట మున్సిపల్‌లో ఇల్లు నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు అనుమతి ఇచ్చారు. మున్సిపల్‌ పరిధిలోకి రాని స్థలానికి కూడా ఎలా అనుమతి ఇస్తారని గాలయ్య అనే వ్యక్తి సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశాడు. టీఎ్‌సఆర్టీసీ కో ఆపరేటివ్‌ సొసైటీకి చెందిన స్థలంలో కొందరు ఆ స్థలం మాదని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అట్టి స్థలంలో ఇల్లు నిర్మాణం కోసం ఏర్పాటుచేసిన ప్రహరీని కూల్చేసి తమకు న్యాయం చేయాలని గాలయ్య కోరాడు. 

Updated Date - 2022-05-24T05:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising