ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతన్న గోస తీర్చేందుకే రచ్చబండ

ABN, First Publish Date - 2022-05-22T05:58:16+05:30

రైతులకు భరోసా కల్పించేందుకే రైతు ర చ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కొమురవెల్లిలో శనివారం ఆయన రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మల్లన్న ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి, గౌరాయపల్లి, మర్రిముచ్ఛాల, రసూ లాబాద్‌, అయినాపూర్‌, గురువన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ డిక్లరేషన్‌తో అన్నదాతకు మహర్దశ

కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య


చేర్యాల, మే 21 : రైతులకు భరోసా కల్పించేందుకే రైతు ర చ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. కొమురవెల్లిలో శనివారం ఆయన రైతు రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మల్లన్న ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి, గౌరాయపల్లి, మర్రిముచ్ఛాల, రసూ లాబాద్‌, అయినాపూర్‌, గురువన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌పై రైతులకు అవగాహన కల్పించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం మాయమాటలతో అన్నదాతలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీల కుమ్మక్కై వరి సాగుకు రైతులను దూరం చేశారని విమర్శించారు. కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేదీ కాంగ్రెస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మండల అధ్యక్షుడు గురువయ్య, నాయకులు వకుళాభరణం నర్సయ్య, నాగమల్ల శ్రీనివాస్‌, లింగంపల్లి శ్రీనివాస్‌, కొయ్యడ శ్రీనివాస్‌, కనకరాజు, రవి, ఆది శ్రీనివాస్‌, కాటం శ్రీనివాస్‌, గూడెపు మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising