ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమతులొచ్చాయి

ABN, First Publish Date - 2022-11-20T23:52:39+05:30

జిల్లాలోని జూనియర్‌ కళాశాలలకు ఎట్టకేలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు వచ్చింది. జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో దాదాపు అన్నింటికి ఇంటర్‌బోర్డు 2022-23 విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపును ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్‌ జిల్లాలో 60 జూనియర్‌ కళాశాలలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు

మెదక్‌ అర్బన్‌, నవంబరు 20: జిల్లాలోని జూనియర్‌ కళాశాలలకు ఎట్టకేలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు వచ్చింది. జిల్లా పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో దాదాపు అన్నింటికి ఇంటర్‌బోర్డు 2022-23 విద్యాసంవత్సరానికి అనుబంధ గుర్తింపును ఇచ్చింది. దీంతో కొద్ది రోజులుగా అనుమతులపై ఆందోళనతో ఉన్న యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 65 జూనియర్‌ కళాశాలలు ఉండగా 60 కళాశాలలకు బోర్డు అనుబంధ గుర్తింపు లభించిందని ఇంటర్‌ జిల్లా నోడల్‌ అధికారి సత్యనారాయణ తెలిపారు.

లోపాలమయంగా కాలేజీలు

జిల్లాలో ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో అనేక లోపాలున్నాయి. అనుమతి ఒకచోట తీసుకొని కళాశాలను మాత్రం మరోచోట నడుపుతున్నారు. అగ్నిమాపకశాఖ అనుమతి లేకపోవడం, సౌకర్యాలు సరిగ్గా లేపోవడంతో ప్రభుత్వం కళాశాలలకు అనుమతి నిరాకరించింది. పలు కాలేజీల్లో అధ్యాపకులు అందుబాటులో లేకపోవడం, నీరు, మౌలిక వసతులు లేకపోవడం కూడా అనుమతుల్లో జాప్యానికి కారణం. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలల్లో అసౌకర్యాలు కనిపిస్తున్నాయి. పలు కళాశాలలు పరిమితికి మించి విద్యార్థులతో కొనసాగుతున్నాయి.

రెండు నెలలుగా ఎదురుచూపులు

ఇంటర్మీడియట్‌ బోర్డు నిబంధనల ప్రకారం 2022-23 విద్యా సంత్సరానికి అనుమతుల జారీ కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న కళాశాల్లో అధికారులు రెండు నెలల కిత్రం తనిఖీలు నిర్వహించి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. చాలా ప్రైవేట్‌ కళాశాలలు బహుళ అంతస్తుల భవనాల్లో నిర్వహిస్తుండడంతో వాటికి అగ్నిమాపకశాఖ నుంచి ఎన్‌ఓసీ లేకపోవడం వంటి కారణాలతో బోర్డు ఇప్పటి వరకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు వస్తుందనే ధీమాతో కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకున్నా ఇంటర్‌ బోర్డు మాత్రం విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి కళాశాలలకు లాగిన్‌ ఐడీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల పేర్లను నమోదు చేయలేదు. తాజాగా సర్కార్‌ అన్ని కళాశాలలకు షరుతులతో కూడిన అనుబంధ గుర్తింపున్విడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఐదు కాలేజీలకు త్వరలో అనుమతులు : సత్యనారాయణ, ఇంటర్‌ నోడల్‌ అధికారి

జిల్లావ్యాప్తంగా 65 జూనియర్‌ కళాశాలున్నాయి. ఇప్పటి వరకు 60 కళాశాలలకు అనుబంధ గుర్తింపు వచ్చింది. మిగిలినవాటికీ త్వరలో పర్మిషన్‌ వచ్చే అవకాశముంది. ఈనెల 30 వరకు విద్యార్థులు అపరాద రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-11-20T23:52:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising