పెండింగ్ స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలి
ABN, First Publish Date - 2022-12-16T23:58:59+05:30
రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎ్‌సయూ నాయకులు డిమాండ్ చేశారు.
పీడీఎ్‌సయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
సిద్దిపేట అర్బన్, డిసెంబరు 16: రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్‌షిప్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎ్‌సయూ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎ్‌సయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. కాగా విద్యార్థి సంఘం నాయకులు కలెక్టరేట్ లోపలికి పరుగులు తీయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, పీడీఎ్‌సయూ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం వారిని అరెస్టు చేసి త్రీటౌన్ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి విద్యనాథ్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న రూ.3,500 కోట్ల బకాయిలను విడుదల చేయకుండా, సీఎం కేసీఆర్ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం సకాలంలో ఉపకార వేతనాలను విడుదల చేయకపోవడం వల్ల ఈ మధ్య కాలంలోనే రామాంతపూర్ నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతిని గుర్తు చేశారు. అలాగే సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీని నెలకొల్పాలని, లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రదీప్, పట్టణాధ్యక్షుడు ప్రణయ్‌కుమార్, కార్యదర్శి హిమవంత్ కృష్ణ, నాయకులు వెంకటే్‌ష, సాయి కార్తీక్, వంశీ, అభిషేక్, గణేష్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:59:00+05:30 IST