ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేపలు పట్టడంలో పంచాయితీ

ABN, First Publish Date - 2022-07-01T05:25:01+05:30

జగదేవ్‌పూర్‌ మండలంలోని ధర్మారం, మర్కుక్‌ మండల పరిధిలోని వరదరాజపూర్‌ గ్రామాల శివారులో గల బోరబండ ప్రాజెక్టు చెరువులో చేపలు పట్టే హక్కు తమకంటే తమకే ఉందంటూ ఇరు గ్రామాల ముదిరాజులు గొడవపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జగదేవ్‌పూర్‌, జూన్‌ 30: జగదేవ్‌పూర్‌ మండలంలోని ధర్మారం, మర్కుక్‌ మండల పరిధిలోని వరదరాజపూర్‌ గ్రామాల శివారులో గల బోరబండ ప్రాజెక్టు చెరువులో చేపలు పట్టే హక్కు తమకంటే తమకే ఉందంటూ ఇరు గ్రామాల ముదిరాజులు గొడవపడుతున్నారు. గురువారం ధర్మారం గ్రామానికి చెందిన ముదిరాజులు చెరువులో వలలు వేసి చేపలు పట్టేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న వరదరాజపూర్‌ ముదిరాజ్‌లు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి జగదేవపూర్‌ పోలీసులు చేరుకుని వరదరాజపూర్‌ గ్రామస్థులను నిలువరించారు. మత్సశాఖ అధికారుల ఆదేశాల మేరకు లీగల్‌గా ధర్మారం వారికి సొసైటీ ఉన్నదని, చేపలు పట్టేందుకు వారికే హక్కు ఉంటుందని చెప్పారు. దీంతో వరదరాజపూర్‌ ముదిరాజ్‌లు అసహనానికి గురయ్యారు. ఇరు గ్రామాల ముదిరాజ్‌లు రెవెన్యూ, మత్స్యశాఖ సొసైటీలతో మాట్లాడుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు వరదరాజపూర్‌ ముదిరాజ్‌లను పంపించారు. 


 

Updated Date - 2022-07-01T05:25:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising