బైక్ అదుపు తప్పి ఒకరి దుర్మరణం
ABN, First Publish Date - 2022-12-15T00:22:19+05:30
మండలంలోని దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి
కొండపాక, డిసెంబరు 14: మండలంలోని దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టకు చెందిన ఏసీ మెకానిక్ ఇమ్రాన్(32), అహ్మద్ అనే యువకుడితో కలిసి బైక్‌పై హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు బయలుదేరారు. వారు దుద్దెడ శివారులోకి చేరుకోగానే బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు ఆవలి వైపునకు దూసుకెళ్లడంతో రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వస్తున్న ఓ లారీ వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇమ్రాన్ తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అహ్మద్‌కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ఆసుపత్రిలో చేర్చారు.
Updated Date - 2022-12-15T00:22:28+05:30 IST