ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడుగుకొక గుంత.. అల్లీపూర్‌ వాసులకు చింత

ABN, First Publish Date - 2022-10-18T05:13:06+05:30

జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అల్లీపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. సంవత్సరాలు గడుస్తున్నా బాగు చేయడం లేదు. రోడ్డును బాగు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరగడం లేదు.

గుంతలమయంగా మారిన అల్లీపూర్‌ ప్రధాన రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నిధులు విడుదలైనా నిర్మాణంలో జాప్యం


జహీరాబాద్‌, అక్టోబరు 17: జహీరాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని అల్లీపూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. సంవత్సరాలు గడుస్తున్నా  బాగు చేయడం లేదు. రోడ్డును బాగు చేసేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరగడం లేదు. ఈ రోడ్డు గుండా నిత్యం అల్లీపూర్‌, బాల్‌నగర్‌, క్రిస్టియన్‌ కాలనీలకు చెందిన వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు మొత్తం గుంతల మయంగా మారడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడి గాయాలపాలవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్థానిక ప్రజలు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రభుత్వం ఈ రోడ్డు పునర్నిర్మాణం కోసం నిధులను కేటాయించినా అధికారుల నిర్లక్ష్యంతో టెండర్లు పూర్తి కాకపోవడంతో నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుంది. 


అతిమ్యాల్‌లో అధ్వానంగా రహదారులు


మనూరు: మనూరు మండలం అతిమ్యాల్‌ గ్రామంలోని ప్రధానవీధులన్నీ బురదమయంగా మారాయి. మురుగు నీటి గుంటలుగా మారినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.


 

Updated Date - 2022-10-18T05:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising