ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబ కలహాలతో ఒకరి బలవన్మరణం

ABN, First Publish Date - 2022-10-07T06:01:03+05:30

కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్గల్‌, అక్టోబరు 6: కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన వర్గల్‌ మండలం దండుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొర్రెగూడెం గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకున్నది. బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రగూడెం గ్రామానికి చెందిన బొర్ర అంజనేయులు(52)కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు ఒక కూతురు సంతానం కాగా, రెండో భార్యకు నలుగురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో 25 ఏళ్ల క్రితం విడిపోయారు. ప్రస్తుతం మొదటి భార్య కుమార్తె వివాహం చేయాలని కోరుతూ కోర్టులో కేసు వేయడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆంజనేయులు రెండో భార్యకు ఈ విషయాన్ని చెప్పుకుని బాధపడేవాడని ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని  గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-10-07T06:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising