ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు పరిష్కరించాలని అధికారుల నిలదీత

ABN, First Publish Date - 2022-12-16T00:00:19+05:30

కోహెడ డిసెంబరు 15: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు అధికారులను నిలదీశారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొక్కుల కీర్తి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోహెడ డిసెంబరు 15: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు అధికారులను నిలదీశారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ కొక్కుల కీర్తి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో భూమి, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని సభ్యులు అధికారులను నిలదీశారు. తహసీల్దార్‌ జావిద్‌ మండలంలో ఉన్నా లేనట్లుగా ఉన్నదన్నారు. సెలవులో వెళ్తుండడంతో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని సభ్యులు వివరించారు. కూరెళ్ల సర్పంచ్‌ గాజుల రమేశ్‌ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో సీసీరోడ్డు వేస్తామని గతంలో హామీఇచ్చారని, కానీ ఇప్పటివరకూ ఎందుకు నిర్మించలేదని అధికారులను నిలదీశారు. పాఠశాలలో కోతుల బెడద ఎక్కువగా బాలికలు తీవ్రఇబ్బందులు పడుతున్నారని, కోతులు రాకుండా వెంటనే పాఠశాల ఆవరణ చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలో నీటి సమస్య ఉన్నదని, పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గ్రామాలల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా సరిగా లేకపోవడం వల్ల గ్రామపంచాయతీలు అధిక విద్యుత్‌ బిల్లుల భారాన్ని భరించాల్సి వస్తున్నదని పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ప్రభుత్వం భారీఎత్తున పింఛన్లను మంజూరుచేసినా, అర్హులకు రాలేదని, మళ్లీ మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఎంపీపీ కీర్తి మాట్లాడుతూ గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీళ్ల అంతరాయాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎన్‌.శ్యామలామధుసూదన్‌రావు, వైస్‌ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, ఎంపీడీవో మధుసూదన్‌, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:00:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising