ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారికంగా సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి

ABN, First Publish Date - 2022-08-05T05:20:03+05:30

సర్దార్‌ సర్వాయి పాపన్న 372వ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రటించడం పట్ల గౌడ సంఘం మెదక్‌ పట్టణ అధ్యక్షుడు గడ్డమీది కృష్ణగౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌ ప్రకటన.. గౌడ కులస్తుల హర్షం

మెదక్‌ అర్బన్‌, ఆగస్టు 4: సర్దార్‌ సర్వాయి పాపన్న 372వ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రటించడం పట్ల గౌడ సంఘం మెదక్‌ పట్టణ అధ్యక్షుడు గడ్డమీది కృష్ణగౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో మాట్లాడుతూ సబ్బంగ వర్ణాల సంక్షేమానికి పోరాడిన సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని 30 ఏళ్లుగా బహుజనులు పోరాడుతున్నా నాటి పాలకులకు మనసు రాలేదన్నారు. కానీ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్న జయంతిని నిర్వహించాలని సీఎం తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. 8న అధికారికంగా జయంతి జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు శ్రీనివా్‌సగౌడ్‌, గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యే పద్మారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.  

పాపన్న జయంతిని గ్రామగ్రామాన నిర్వహించాలి

నారాయణఖేడ్‌, ఆగస్టు  4: సర్దార్‌ సర్వాయి పాపన్న 372వ జయంతిని గ్రామగ్రామాన నిర్వహించాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అంజాగౌడ్‌ కోరారు. గురువారం నారాయణఖేడ్‌లోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటుచేసిన డివిజన్‌ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 18న సర్వాయి పాపన్న జయంతిని నిర్వహించాలన్నారు. ప్రభుత్వపరంగా ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్తర్వులను జారీచేయడం హర్షణీయమన్నారు. ఈ సమావేశంలో డివిజన్‌ నాయకులు నర్సింహాగౌడ్‌, లక్ష్మాగౌడ్‌, పండరిగౌడ్‌, శ్యామాగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T05:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising