గంగమ్మకు ఘనంగా హారతులు
ABN, First Publish Date - 2022-12-07T23:42:06+05:30
సిద్దిపేట క్రైం, డిసెంబరు 7: సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద ఉన్న గంగాభవాని ఆలయం 27వ వార్షికోత్సవాన్ని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.
సిద్దిపేట క్రైం, డిసెంబరు 7: సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద ఉన్న గంగాభవాని ఆలయం 27వ వార్షికోత్సవాన్ని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర మహిళలు బోయగల్లి నుంచి గంగా భవాని ఆలయం వరకు మంగళహారతులతో ర్యాలీ నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. అనంతరం గంగపుత్రులు కోమటిచెరువులో తెప్పోత్సవం నిర్వహించారు. వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారు విగ్రహాన్ని అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ మంజులారాజనర్సు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం అధ్యక్షుడు బిజ్జి రాజం, గంగాభవాని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏర్వ మల్లేశం, కమిటీ సభ్యులు చంద్రం, గణేష్, సుమన్, కిషన్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:42:07+05:30 IST