ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్కి..మొలకెత్తి

ABN, First Publish Date - 2022-08-13T05:16:23+05:30

ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్‌ జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిచి ముక్కిపోయాయి.

మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలోని ఓ రైస్‌మిల్లులో వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎందుకూ కొరగాని 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 

మార్గదర్శకాలు వచ్చాకే కొనుగోళ్లపై తుది నిర్ణయం

ఆందోళనలో మిల్లర్లు


మెదక్‌, ఆగస్టు 12: ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మెదక్‌ జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిచి ముక్కిపోయాయి. పలు మిల్లుల్లో మొలకెత్తాయి. 2021-2022 సీజన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం రైస్‌ మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉన్నాయని జిల్లా పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ధాన్యాన్ని మరాడించక ముందే యాసంగి ధాన్యం సేకరించడంతో నిల్వలు ఎడతెరిపి లేకుండా పేరుకుపోయాయి. మెదక్‌, వెల్దుర్తి, పాపన్నపేట, తూప్రాన్‌, చేగుంట, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, మాసాయిపేట, పెద్దశంకరంపేట రైస్‌మిల్లుల్లో మిల్లర్లు ధాన్యాన్ని ఆరుబయట టార్పాలిన్లు కప్పి నిల్వ చేశారు. ఎన్నడూ లేనంతగా ఈ వర్షాకాలంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో  ధాన్యం పలు చోట్ల తడిసి మొలకలొచ్చాయి. మెదక్‌ పట్టణ శివారులోని మంబోజిపల్లి ఎన్‌డీఎ్‌సఎల్‌ గోదాంలో సుమారు 150 లారీల ధాన్యం తడిసి ముక్కిపోయింది. జిల్లాలో 157 రైస్‌మిల్లుల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో తడిసి బూజు పడుతున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు ధాన్యం విషయంలో ఏం మాట్లాడటం లేదు. 


మార్గదర్శకాలు వచ్చాకే నిర్ణయం 

- శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, మెదక్‌

2021-2022 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైస్‌ మిల్లులు, గిడ్డంగుల్లో నిల్వ చేశారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ధాన్యం పలు చోట్ల మొలకెత్తడం లేదా బూజు పట్టడం ముక్కిపోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నాం. 


========================================================================================================================================================================



Updated Date - 2022-08-13T05:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising