ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త ఆశలు

ABN, First Publish Date - 2022-12-31T23:31:41+05:30

నూతన సంవత్సరంలో కీలక అడుగులు అందుబాటులోకి ఐటీ టవర్‌, వెయ్యి పడకల ఆస్పత్రి ఈ ఏడాదిలోనే జాతీయ రహదారుల నిర్మాణం గౌరవెల్లి రిజర్వాయర్‌కూ ముహూర్తం హామీలపైనా దృష్టి పెట్టాల్సిన తరుణం

సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఎన్సాన్‌పల్లి శివారులో శరవేగంగా నిర్మిస్తున్న వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 31: 2022వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నేటి నుంచి 2023 నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. 2016 అక్టోబరు నెలలో సిద్దిపేట జిల్లా ఏర్పాటైన నాటి నుంచి 6 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏటా సరికొత్త కార్యక్రమాలు, చరిత్రలో నిలిచే ప్రతిష్టాత్మక పనులు, సమాజహితమైన అడుగులు ఆవిష్కృతమయ్యాయి. ఈ ఏడాది కూడా జిల్లా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి మార్గాలు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఎన్సాన్‌పల్లి శివారులో నిర్మిస్తున్న వెయ్యి పడకల ఆస్పత్రి భవనాలు తుదిదశకు చేరాయి. త్వరలోనే ఈ ఆస్పత్రిని ప్రారంభించి పేద రోగులకు అందుబాటులోకి తేనున్నారు. అన్ని రకాల సర్జరీలు, వైద్యచికిత్సలను చేపట్టనున్నారు. ఈ ఏడాది నుండే 150 మంది ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ విద్యార్థులు ఆస్పత్రిలో విధులు నిర్వహించనున్నారు. అదే విధంగా ఫార్మసీ కళాశాల, నర్సింగ్‌ కళాశాల సొంత భవనాలు, పారామెడికల్‌ కోర్సులు కళ్లముందు కనిపించనున్నాయి.

చివరి దశలో గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు

మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని సస్యశామలం చేయడానికి నిర్మించతలపెట్టిన గౌరవెల్లి రిజర్వాయర్‌ పనులు చివరి దశలో ఉన్నాయి. గత రెండేళ్లుగా నిర్వాసితుల పరిహారం విషయంలో ఆందోళనలు జరుగుతుండగా ఇటీవలే ఒక కొలిక్కివచ్చింది. ప్రస్తుతం పోలీసుల బందోబస్తు నడుమ రిజర్వాయర్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ పూర్తయిన క్రమంలో త్వరలోనే రిజర్వాయర్‌ను ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. 8.5టీఎంసీల ఈ రిజర్వాయర్‌ పూర్తయితే 2.50లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరుతుంది.

జాతీయ రహదారులకు మోక్షం

జాతీయ రహదారుల ఏర్పాటుతో సిద్దిపేట జిల్లాకు కొత్త కళ సంతరించుకోనున్నది. సిద్దిపేట మీదుగా మెదక్‌-ఎల్కతుర్తి నేషనల్‌ హైవేకు సుమారు రూ.1,400 కోట్లు మంజూరయ్యాయి. పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాదిలో సగానికి పైగా పని పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అదే విధంగా దుద్దెడ-జనగామ రహదారి, సిరిసిల్ల-సూర్యాపేట, సిద్దిపేట-ఇల్లంతకుంట రహదారులతో జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపడనున్నది.

హామీలు తీర్చాల్సిన తరుణమిదే

ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికలతోపాటు పలు సందర్భాల్లో జిల్లాకు సంబంధించిన హామీలను సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. ఇప్పటికే హామీలన్నీ పరిష్కారం దిశలో ఉండగా ఇంకొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌, రంగనాయక సాగర్‌ రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చి ఏడాది దాటుతోంది. అయినా పనుల్లో ప్రగతి లేదు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు సంబంధించిన నిర్వాసితుల పరిహార పంపిణీ ఇంకనూ పూర్తికాలేదు. జిల్లా వ్యాప్తంగా పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్లలో దాదాపు 5వేల ఇళ్ల వరకు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని రిజర్వాయర్లకు అనుసంధానంగా చేపట్టే కాలువల నిర్మాణం నత్తనడకన కొనసాగుతున్నాయి. దుబ్బాక, చేర్యాల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కోసం స్థానికంగా డిమాండ్‌ చేస్తున్నారు.

సిద్దిపేట ఐటీ టవర్‌ సిద్ధం

గ్రామీణ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని విస్తరించే క్రమంలో సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద ఐటీ టవర్‌ నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ.50కోట్లతో మూడు ఎకరాల్లో ఈ టవర్‌ను అద్భుతంగా నిర్మించారు. ఇప్పటికే మూడు అమెరికన్‌ కంపెనీలతో ఒప్పందం కూడా పూర్తయ్యింది. వచ్చే జూన్‌ నెలలో ఐటీటవర్‌ అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. సుమారు 1,500 మంది స్థానికులకు ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి. నూతన జిల్లాల్లో మొట్టమొదటిగా ఏర్పాటైన ఐటీ టవర్‌ సిద్దిపేటదే కావడం విశేషం.

ఈ ఏడాదిలోనే రైలుకూత

మనోహరబాద్‌-కొత్తపల్లి రైల్వేలైను నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం సిద్దిపేట పట్టణ శివారులో రైల్వే స్టేషన్‌ను శరవేగంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే గజ్వేల్‌లో రైల్వే స్టేషన్‌ పూర్తికాగా గూడ్సు రైళ్ల రాకపోకలు జరుగుతున్నాయి. ట్రాక్‌ పనులు సైతం సిద్దిపేట శివారుదాకా కొనసాగుతూ వచ్చాయి. మరో నాలుగైదు నెలల్లో సిద్దిపేట స్టేషన్‌ వరకు ట్రాక్‌ నిర్మాణం పూర్తవుతుంది. ఇదే జరిగితే మనోహరబాద్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా సిద్దిపేటకు రైలు రావడం ఖాయమే.

Updated Date - 2022-12-31T23:31:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising