కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2022-10-18T05:14:36+05:30
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి విమర్శించారు.
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి
అదనపు కలెక్టర్‌కు అఖిలపక్షం వినతి
మెదక్ అర్బన్, అక్టోబరు 17: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఆఖిలపక్ష నేతలతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ రమే్‌షకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికపై ఉన్న ధ్యాస సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డిలకు రైతులపై లేదన్నారు. టార్పాలిన్లను రాష్ట్ర ప్రభుత్వం అందజేయకపోవడంతో ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. ప్రభుత్వ మద్దతు ధరతోనే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రామాయంపేట, నిజాంపేట మండలాల్లో మక్కల కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి... టార్పాలిన్లు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆప్జల్, ఏఎంసీ మాజీ చైర్మన్ గంటరాజు, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, రవి, కౌన్సిలర్ లింగం, అఖిలపక్షల నేతలు దమ్ముయాదగిరి, కరీం, కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:14:36+05:30 IST