ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిట్టపల్లిలో వెయ్యేళ్ల క్రితం అధికార నంది విగ్రహం

ABN, First Publish Date - 2022-06-29T05:46:45+05:30

సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో వెయ్యి సంవత్సరాల కిందటి అధికార నంది విగ్రహాన్ని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ మంగళవారం విలేకులకు తెలియజేశారు. శిల్పం నాలుగు చేతులతో అరుదైన ఆసన భంగిమలో ఉన్నదని చెప్పారు. వెనక చేతుల్లో పరశువు, మృగం, ముందు కుడిచేయి వరదహస్తంగా, ఎడమచేతిలో అధికార దండం కనిపిస్తున్నదని వెల్లడించారు.

మిట్టపల్లి ఆలయంలో గుర్తించిన అధికార నంది విగ్రహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్దిపేట అర్బన్‌, జూన్‌ 28: సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో వెయ్యి సంవత్సరాల కిందటి అధికార నంది విగ్రహాన్ని గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్‌ మంగళవారం విలేకులకు తెలియజేశారు. శిల్పం నాలుగు చేతులతో అరుదైన ఆసన భంగిమలో ఉన్నదని చెప్పారు. వెనక చేతుల్లో పరశువు, మృగం, ముందు కుడిచేయి వరదహస్తంగా, ఎడమచేతిలో అధికార దండం కనిపిస్తున్నదని వెల్లడించారు. కుతుబ్‌షాహీల కాలంలో మహారాష్ట్ర నుంచి పిలిపించబడిన సిద్ధసోమాజీ మిట్టపల్లి కేంద్రంగా 40 గ్రామాలకు దేశ్‌ముఖ్‌గా నియమించబడ్డారు. ఆయన హనుమంతుడి భక్తుడు కావడంతో మిట్టపల్లిలో హనుమాన్‌ ఆలయాలను కట్టించారు. తల్లి కోరిక మేరకు ఓ శివాలయం కూడా నిర్మించారు. ఆ ఈలయంలోనే అధికార నంది శిల్పాన్ని గుర్తించారు. అధికార నంది గురించి లింగపురాణంలో, శివధ్యానరత్నావళి, శివార్చనచంద్రికల్లో వివరించబడిందని ఆయన పేర్కొన్నారు. పూర్వ చాళుక్యుల శిల్ప కళలో అధికార నంది శిల్పాలు కనిపిస్తాయని చెప్పారు.

Updated Date - 2022-06-29T05:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising