ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు ఆదర్శ గురుకులం.. నేడు అధ్వానం

ABN, First Publish Date - 2022-08-04T06:02:43+05:30

ఉమ్మడి రాష్ట్రంలోనే ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచిన మెదక్‌ జిల్లా అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల విద్యాలయం నేడు ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వాన పరిస్థితుల్లో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు.

నర్సాపూర్‌ అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకులం, పూర్తిగా ధ్వంసమైన కిటికీలు, ఓ గదిలో పెచ్చులూడిన పైకప్పు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్న భవనం .. నాణ్యత లేని భోజనం 

ఇదీ నర్సాపూర్‌ అల్లూరిసీతారామరాజు గిరిజన గురుకులం దుస్థితి 

  నర్సాపూర్‌, ఆగస్టు 3: ఉమ్మడి రాష్ట్రంలోనే ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచిన మెదక్‌ జిల్లా అల్లూరి సీతారామరాజు గిరిజన గురుకుల విద్యాలయం నేడు ఎవరూ పట్టించుకోకపోవడంతో అధ్వాన పరిస్థితుల్లో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. పైగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రస్థాయిలో ఫైన్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తూ విద్యనందిస్తున్న గురుకులం కూడా ఇదే కావడం గమనార్హం.  


శిథిలావస్థలో..

 నర్సాపూర్‌లోని అల్లూరిసీతారామరాజు గిరిజన గురుకులంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 480మంది, ఇంటర్‌లో 240మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.  గత ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రత్యేక చొరవతో జన్మభూమిలో 70శాతం విరాళాలతో ఈ గురుకులంను నిర్మించారు.  మొదట్లో ఆరునుంచి పదోతరగతి వరకే ఉన్న ఈ గురుకులంలో ఈ మధ్యనే ఇంటర్‌ కూడా ప్రవేశ పెట్టారు. కాగా ఈ గురుకులం భవనం నిర్మించి దాదాపు 25 గడిచిపోవడంతో గదులన్నీ శిథిలావస్థకు చేరాయి. పై కప్పులన్నీ పెచ్చులూడి పడుతున్నాయి. ఇక ఫర్నిచర్‌ కూడా పాతదే కావడంతో మొత్తం విరిగిపోయి ఉంది.  పడుకోవడానికి  సరైన పడకలు లేక విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు.  గదుల్లో ఉండే ఫ్యాన్లు, విద్యుత్‌ స్విచ్‌లు ఎక్కడికక్కడ దెబ్బతిని ప్రమాదకరంగా మారాయి. 


వేధిస్తున్న తాగునీటి సమస్య

స్కూల్‌, ఇంటర్‌ విద్యార్థులు సుమారు 700మంది వరకు ఉండే ఈ ప్రాంగణంలో నీటి సమస్య తీవ్రంగా వేధిస్తున్నది. మిషన్‌భగీరథ నీరు పూర్తిస్థాయిలో సరిపోక తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఒక మినరల్‌ ఆర్‌వో ప్లాంటు ఉన్నా అది ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేక తాగునీటి కోసం పోటీపడాల్సిన పరిస్థితి. ఇంటర్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మరో ఆర్‌వో ప్లాంటు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉందని విద్యార్థులు పేర్కొంటున్నారు. 


అమలు కాని మెనూ

మెనూ ప్రకారం రోజుకు విద్యార్థికి ఉదయం టిఫిన్‌తో పాటు బూస్టు, మధ్యాహ్నం అన్నం, రాత్రి  భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్‌ కూడా ఏర్పాటు చేయాలి. ఇందులో  నెలకు నాల్గుసార్లు చికెన్‌, రెండుసార్లు మటన్‌ పెట్టాల్సి ఉంటుంది. అయితే  ఇందుకు ప్రభుత్వం నుంచి ఒక్కో విద్యార్థికి ఇంటర్‌వారికి రోజుకు కేవలం 50రూ. స్కూల్‌విద్యార్థికి 38రూ. మాత్రమే వస్తుంది. దీంతో  ప్రస్తుతం పెరిగిన నిత్యావసర ధరలకు తగ్గట్టు  మెనూ ప్రకారం విద్యార్థులందరికి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు.. కాబట్టి నిర్వాహకులు దారుణమైన భోజనం పెడుతున్నారు. ఒక్కోసారి తినలేక పస్తులుండాల్సిన దుస్థితి కూడా నెలకొందని గురుకుల విద్యార్థులు వాపోతున్నారు. గత ఆదివారం ఉదయం దొడ్డురవ్వతో పెట్టిన ఉప్మాలో పురుగులు ఉండటంతో  తినలేక బయట పడేసి గురుకులం ఎదురుగా బైఠాయించి నిరసన కూడా తెలిపి తమగోడును ప్రిన్సిపాల్‌ రాంమోహన్‌తో మొర పెట్టుకున్నారు. 


 నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం

గిరిజన గురుకులం భవనం శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారడంతో రూ.కోటీ 60లక్షలతో మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.75లక్షలు మాత్రమే మంజూరు చేసింది. దీంతో ఆ డబ్బులతో పనులు ఏడాదిన్నర క్రితమే ప్రారంభించిన సదరు కాంట్రాక్టర్‌కు డబ్బులు సకాలంలో అందకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. వర్షం పడినపుడు పైకప్పు నుంచి ఉరుస్తుండటంతో పాటు పెచ్చులూడుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గురుకులంలోని సమస్యలను గుర్తించి పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.  

Updated Date - 2022-08-04T06:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising