ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముదిరాజ్‌లు సముచిత స్థానం కోసం పోరాడాలి

ABN, First Publish Date - 2022-11-27T23:49:13+05:30

ముదిరాజ్‌లకు సమాజంలో సముచిత స్థానం లభించేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పోరేటర్‌ ఎం.సపానాదేవ్‌ అన్నారు. రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ ఆదేశాల మేరకు ఆదివారం పటాన్‌చెరు ముదిరాజ్‌ భవన్‌లో సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టప్పకుమార్‌, మల్లేశంను సన్మానిస్తున్న ముదిరాజ్‌ మహాసభ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సపానాదేవ్‌

పటాన్‌చెరు, నవంబర్‌ 27: ముదిరాజ్‌లకు సమాజంలో సముచిత స్థానం లభించేందుకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ కార్పోరేటర్‌ ఎం.సపానాదేవ్‌ అన్నారు. రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ ఆదేశాల మేరకు ఆదివారం పటాన్‌చెరు ముదిరాజ్‌ భవన్‌లో సంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా టప్పకుమార్‌ ముదిరాజ్‌, ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ న్యాయవాది మల్లేశం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు సపానాదేవ్‌, ప్రకాష్‌, చెన్నయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లు సామాజికంగా, ఆర్ధికంగా ఆశించిన ప్రగతి సాధించలేకపోయారన్నారు. తీవ్ర అణచివేతకు గురవుతూ చట్టసభల్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. బాధ్యతలు స్వీకరించిన టప్పకుమార్‌, మల్లేశం మాట్లాడుతూ జిల్లాలో అధిక శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లను ఏకం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. త్వరలోనే జిల్లాలో విస్తృతంగా పర్యటించి అందరి ఆమోదంతో కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. సమావేశంలో ముదిరాజ్‌మహాసభ నాయకులు నారాయణ, నివార్తిదేవ్‌, నాగసాని తులసీదాస్‌, సుక్కయ్య, సురేందర్‌, కృష్ణ, టీ.సురేందర్‌, శ్రీకాంత్‌, నరే్‌షకుమార్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-27T23:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising