ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన ఊరు - మనబడి పనులపై ఎంపీపీ సమావేశం

ABN, First Publish Date - 2022-12-12T23:46:14+05:30

మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అధ్యక్షతన పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు-మన బడి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

మాట్లాడుతున్న ఎంపీపీ శేరి నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హవేళిఘణపూర్‌, డిసెంబరు 12: మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అధ్యక్షతన పాఠశాలల్లో జరుగుతున్న మన ఊరు-మన బడి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా.. పాఠశాలల్లో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని మెదక్‌ జిల్లా ప్రాజెక్టు ఏఎ్‌సవో శశిధర్‌ సూచించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మౌళిక వసతుల ఏర్పాటు కోసం రూపొందించిన ఈ పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. మండలంలో గుర్తించిన 5 మాడల్‌ స్కూల్స్‌ల పనులు ఈ నెల 31 వరకు పూర్తి చేయాలన్నారు. పని పూర్తి కాగానే ఎంబి రికార్డులు చేసిన తర్వాతే డబ్బులు మంజూరవుతాయన్నారు. పనులు ప్రారంభించకుంటే రద్దు చేసి మరో స్కూల్‌కు మార్పిడి చేయనున్నట్లు చెప్పారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఉపాధిహామీ బిల్లులను త్వరగా చెల్లించాలని హవేళిఘణపూర్‌ సర్పంచ్‌ సవితాశ్రీకాంత్‌ అధికారులను కోరారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్‌, డీఈ పాండురంగారెడ్డి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ విజయక్ష్మి, ఎంపీడీవో శ్రీరామ్‌, ఎంఈవో నీలకంఠం, మధుమోహన్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎస్‌ఎంసీ చైర్మన్‌లు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising