ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిట్టపల్లి మహిళా సంఘాలు ఎంతో ఆదర్శం

ABN, First Publish Date - 2022-06-26T05:06:07+05:30

మిట్టపల్లి మహిళా సంఘాలు పప్పులు, పసుపు, కారం తయారు చేయడంలో ఆర్థిక అభివృద్ధి చెంది ఇతర మహిళా సంఘాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయని సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి అన్నారు.

మిల్లును ప్రారంభిస్తున్న సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మిట్టపల్లి పప్పుల అమ్మకానికి ఫ్లిప్‌కార్ట్‌లో చోటు

 సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవిత

 పసుపు, కారం తయారీ మిల్లు ప్రారంభం


సిద్దిపేట అర్బన్‌, జూన్‌ 25: మిట్టపల్లి మహిళా సంఘాలు పప్పులు, పసుపు, కారం తయారు చేయడంలో ఆర్థిక అభివృద్ధి చెంది ఇతర మహిళా సంఘాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయని సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి అన్నారు. మిట్టపల్లి మహిళా సంఘాల ఆధ్వర్యంలో శనివారం పసుపు, కారం తయారీ మిల్లును వారు ప్రారంభించి, మాట్లాడారు. మిట్టపల్లి పప్పులకు ఫ్లిప్‌కార్ట్‌లో సైతం చోటు దక్కడం మిట్టపల్లి పప్పుల నాణ్యత ప్రమాణాలకు నిదర్శనమన్నారు. మిట్టపల్లి పప్పుల బాటలోనే పసుపు, కారం ఉత్పత్తులు కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరారు. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన రుణాలను సొంత అవసరాలకు వాడకుండా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునని తెలిపారు. కారం, పసుపు ఉత్పత్తిలో మిట్టపల్లి బ్రాండ్‌ అంబాసిడర్లుగా నిలవాలని  ఆకాంక్షించారు. మహిళలు కలిసికట్టుగా ముందుకు సాగడం, మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఎంతో స్వాగతించదగ్గ విషయం అని అభినందించారు. కార్యక్రమంలో మంత్రి ఓఎ్‌సడీ బాల్‌రాజ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ లక్ష్మి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్‌ ప్రభాకర్‌వర్మ, ఏపీఎం చంద్రం, సీఏ రేఖ, మహిళా సంఘాల ప్రతినిధులు లక్ష్మి, స్థానిక నాయకులు అంకుష్‌ వలి, ఫయాజ్‌, కుమార్‌, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-06-26T05:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising